సీపీఐ(ఎం) శ్రేణుల్లో ఫుల్‌జోష్‌

Fuljosh in CPI(M) ranks– రాజస్థాన్‌లో భారీ ప్రదర్శనలతో నామినేషన్‌ పత్రాల దాఖలు
రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సీపీఐ(ఎం) శ్రేణుల్లో ఫుల్‌జోష్‌ కనిపిస్తోంది. ఓటర్లు పూల వర్షం కురిపిస్తుండగా భారీ ప్రదర్శనలు ఆకట్టు కుంటున్నాయి. బికనీర్‌ జిల్లాలోని దుంగార్‌ఘర్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా గిర్ధారి మహియా నామినేషన్‌ దాఖలు చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిర్ధారి కూడా విజయం సాధించారు. రెండోసారి గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఇక చురు జిల్లాలోని సర్దార్‌షహర్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం)అభ్యర్థిగా ఛగన్‌లాల్‌ చౌదరి నామినేషన్‌ దాఖలు చేశారు.