ఉచిత కరెంటు వద్దు అన్నది ఎవరు ?

– రైతుబంధు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది ఎవరు ?
– దమ్ముంటే నిరూపించాలి సతీష్‌ రెడ్డికి సవాల్‌..
– సీతక్కను న్యాయబద్ధంగా ఎదుర్కోలేకనే అబద్దాల ప్రచారం
– కాంగ్రెస్‌ పార్టీ ములుగు జిల్లా అధికార ప్రతినిధి కత్తెర పల్లి భాస్కర్‌
నవతెలంగాణ – ములుగు
ఉచిత కరెంటు వద్దు అన్నది ఎవరు, రైతుబంధు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది ఎవరు, దమ్ముంటే నిరూపించు అని రెడ్కో చైర్మన్‌ సతీష్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కత్తెర పల్లి భాస్కర్‌ సవాల్‌ చేశారు. జిల్లా కాం గ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ ఇంకెన్నాళు అబద్ధాలతో తెలంగాణ ప్రజ లను మభ్యపెడతారని, అనని మాటలు అన్నట్టు గ్లోబెల్స్‌ ప్రచా రం చేస్తూ సీతక్క పై కుట్రలు పన్నుతున్నారని, ఆయన అన్నారు. నిప్పులాంటి సీతక్కని ముట్టు కునే ధైర్యం లేక దుష్ప్రచారం నిర్వహిస్తూ ప్రజ ల్లోకి వెళ్లాలని చూస్తున్నారని అన్నారు. రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసిందా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎన్నికల కమిషన్‌ అలాంటిది ఏమీ లేదని చెప్పిన విషయం సతీష్‌ రెడ్డికి తెలియదా అని, అసలు మీరు రైతుబంధు ఇవ్వాలి అనుకుంటే ఇ ప్పటివరకు ఎలక్షన్‌ కమిషన్‌కి అనుమతి కోసం లేఖ ఎందు కు రాయలేదని ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటు మూడు గంటలు ఇస్తే రైతు లకు ఉప యోగకరంగా ఉంటుందని, నాణ్య తలేని కరెం టు 24 గంటలు ఇచ్చిన ఉపయోగం లేదు అని టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి చెబితే వక్రీకరించే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్నారని అన్నారు. మీ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని అన్నారు. 9 సంవత్సరాలు మంత్రిగా చేసిన కేటీఆర్‌ మొన్న బహిరంగ సభలో మాట్లాడుతూ కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ హైదరాబాదులో త్వరలో ఏర్పాటు కాబోతున్న ఒక ప్రఖ్యాత కంపెనీకి రాసినట్టుగా చెబుతూ ఒక నకిలీ లేఖ సష్టించి తెలంగాణ ప్రజలలో సానుభూతి పొందే ప్రయత్నం చేశా రని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి యాసం రవికుమార్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా కార్యదర్శి గుంటోజు శంకర్‌, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి అనిల్‌, మండల ఉపాధ్యక్షులు హర్షం రఘు, కాంగ్రెస్‌ నాయకులు గండ్రత్‌ మహేందర్‌, దాదా రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.