రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– కాటాపూర్ సర్పంచ్ పుల్లూరు గౌరమ్మ 
– వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ- తాడ్వాయి
 రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని కాటాపూర్ సర్పంచ్ పుల్లూరు గౌరమ్మ అన్నారు. మండలంలోని కాటాపూర్ గ్రామంలో గురువారం గిరిజన సహకార సంస్థ ఏటూర్ నాగారం (జిసిసి) ఆధ్వర్యంలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌరమ్మ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. రైతు బీమా, రైతుబంధు ప్రవేశపెట్టిందని  అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని, ఏ వన్ గ్రేడ్ 2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యం 2040 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివో లీడర్ పాలకుర్తి రోజా, హమాలి సంఘం నాయకులు, రైతులు షేక్ ముజఫర్, కూలీలు తదితరులు పాల్గొన్నారు.