బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు కరారు.. గెలుపే లక్ష్యంగా పోటీ

నవతెలంగాణ- నసురుల్లాబాద్:
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముందు నుంచి ముగ్గు చూపడం పేరు ఖరారు చేయడంతో బాన్స్వాడ నియోజకవర్గంలో బీర్కూర్ బాన్సువాడ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి బాన్సువాడ నియోజకవర్గం టికెట్ ఖరారు చేయడంతో స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేయగా మరికొందరు నిరసన వ్యక్తం అవుతున్నాయి.
 ఏనుగు రవీందర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే 
ఎల్లారెడ్డి నియోజకవర్గం నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పని చేసాడు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం
2004, 2008, 2010, 2014 -2018 వరకు ఎమ్మెల్యే గా పని చేసారు.
వ్యక్తిగత వివరాలు
 ఏనుగు రవీందర్ రెడ్డి
జననం 05 ఏప్రిల్ 1965 ఎర్రపహాడ్ లో జన్మించారు. ఆరోగ్యశాఖలో పనిచేశారు. అనంతరం అనంతరం రాజకీయంపై ఆసక్తి చూపారు గతంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా లో పని చేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా న బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
జీవిత భాగస్వామి మంజుల రెడ్డి
సంతానం నిఖిల్ రెడ్డి, వైష్ణవి రెడ్డి,
నివాసం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం, ఎర్రపహాడ్ గ్రామం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువు కున్నారు.
ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి 4 జూన్ 2021న రాజీనామా చేశాడు.
ఆయన 4 జూన్ 2021లో ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. తిరిగి ఏనుగు రవీందర్ రెడ్డి 2023 అక్టోబర్ 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.
జననం, విద్యాభాస్యం
ఏనుగు రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, యెర్రపహాడ్ గ్రామంలో జన్మించాడు. ఆయన 1981లో యెర్రపహాడ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. రవీందర్‌ రెడ్డి 1984లో నర్సాపూర్ లో ఇంటర్మీడియట్, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ లో 1986లో ఎస్.ఐ.టి.సి కోర్స్ ను, ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఎస్సీ పూర్తి చేశాడు.
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు 
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
సంవత్సరం నియోజకవర్గం ప్రత్యర్థిమెజారిటీ (ఓట్లు)ఫలితం
2004 ఎల్లారెడ్డి జనార్ధన్ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీ పై 10,267 ఓట్ల తో గెలుపొందారు.
2008లో ఉప ఎన్నిక ఎల్లారెడ్డి జనార్ధన్ గౌడ్ (కాంగ్రెస్‌ పార్టీ)12,345 తో ఓటమి పాలయ్యారు.
2009లో ఎల్లారెడ్డి జనార్ధన్ గౌడ్ కాంగ్రెస్పీ పై 36,859గెలుపు
2010లో ఉప ఎన్నిక ఎల్లారెడ్డి లో షబ్బీర్‌ అలీ (కాంగ్రెస్ పై 37,662 గెలుపొందారు.
2014లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జాజుల సురేందర్ కాంగ్రెస్ 24,009 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2019లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం జాజుల సురేందర్(కాంగ్రెస్)35,148 ఓట్లతో ఓటమి పాలయ్యారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఐక్యత లోపంతో నియోజకవర్గ స్థానికులకు టికెట్ ఇవ్వకుండా స్థానికేతులకు టికెట్ కేటాయించారు. స్థానిక నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి కి సంపూర్ణ మద్దతిస్తారా అనే విషయం ప్రశ్నార్థంగా మారింది.