– యువసేన నాయకులు బాలు యాదవ్ కృతజ్ఞతలు
నవతెలంగాణ- మద్నూర్: కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సరైన నాయకున్ని ఎంపిక చేయడం పట్ల మద్నూర్ మండల కేంద్రంలో యువసేన నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం నాడు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు విద్యావంతుడు రాజకీయ అనుభవం గల వ్యక్తి తోట లక్ష్మీకాంతరావుకు టికెట్ ఖరారు చేయడం సంతోషంగా ఉందని యువసేన నాయకులు పేర్కొన్నారు. తోట లక్ష్మీకాంతరావు యువసేన నాయకులు బాలు యాదవ్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ముమ్మర ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకుండా సర్వనాశనం చేసిన హనుమంత్ షిండే ఓటమి కొరకు పోరాటం చేసి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. ఈసారి జరిగే ఎన్నికలతో హనుమంత్ షిండే ను రాజకీయ సమాధి చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు తెలియపరుస్తాం, కచ్చితంగా జుక్కల్ అభివృద్ధి కావాలి అంటే ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి, ప్రశ్నించే గొంతుక లక్ష్మీ కాంతారావు గారిని గెలిపించాలి, ప్రజలు ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ కాంతారావు యువసేన మారుతి కార్రెవర్ కొలావార్ పండరి రాజు బుడగ జంగం సందీప్ లాజంగ్ల వార్ రాజు సౌండ్కేవార్ నలమెల్వార్ విఠల్ సాయి గోవింద్ వార్ తదితరులు పాల్గొన్నార.