కాంగ్రెస్ లో భారీగా చేరికలు

నవతెలంగాణ ఆర్మూర్: మాదాపూర్ గ్రామ సర్పంచ్ కొట్టాల లింగారావు బీ.ఆర్.ఎస్. పార్టీ నుండి కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో మంగళవారం చేరడం జరిగింది. వారితో పాటు పలువురు బీ.ఆర్.ఎస్. నాయకులు కూడా పార్టీ లో చేరడం జరిగింది, ఈ సందర్భంగా పట్టణంలోని పివిఆర్ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నియోజకవర్గం మొత్తం పెద్ద మొత్తం లో నాయకులు స్వచ్ఛందంగా నా ఆధ్వర్యంలో చేరుతున్నారని, ఈ సారి భారీ మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.