ఒకే రోజు పదిమంది అభ్యర్థులు నామినేషన్ల దాఖల

నవతెలంగాణ- మద్నూర్:జుక్కల్ ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీకి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాడు ఒకేరోజు పది మంది అభ్యర్థులు మొత్తం 14 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు వీటిలో ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏడుగురు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అధికారికి అందజేశారు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా1 గాయక్వాడ్ ప్రకాష,2, గంగారం3, గైని ప్రేమ్ కుమార్, ఇక పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో1, టీ అరుణతార భారతీయ జనతా పార్టీ,2, బాబు ఆర్ బహుజన్ భారత్ పార్టీ3, భూమయ్య పొన్నగంటి వారి ధర్మసమాజ్ పార్టీ4, హనుమంతు సిందే భారత రాష్ట్ర సమితి5, గైని రాజు ఇండియా ప్రజాబంధు పార్టీ6, బొగుడ మీద సాయిలు బీఆర్ఎస్ పార్టీ7, శోభావతి సిందే భారత రాష్ట్ర సమితి, ఈ విధంగా ఒకేరోజు పదిమంది తమ నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.