నవతెలంగాణ -నసురుల్లా బాద్: బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ లో అసమ్మతి సెగలు బగ్గుమంటుంది, బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేతలు, కాసుల బలరాజ్ అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానకు నిరసనగా బుధవారం బాన్సువాడ పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాసుల బాలరాజుకు సంఘీభావం తెలిపేందుకు బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతకాలు కాసుల బాలరాజు మాట్లాడుతూ బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికులకు ఎందుకు కేటాయించలేదో కారణం చెప్పాలన్నారు. పార్టీలు మారకుండా గత 20 సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన టికెట్ ఇవ్వకుండా పార్టీలు మారుస్తూ కొత్తగా వచ్చిన వారికీ టికెట్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు.. పార్టీ కోసం రేయి పగలు కష్టపడుతుంది మీము.. వివిధ పార్టీలు మారిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటి..? ఇతర పార్టీ నుండి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన వారికీ ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఫై మండిపడుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గం టికెట్ కోసం స్థానికులు 16 మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఎవ్వరికైనా టికెట్ ఇచ్చిన తామంతా కష్టపడి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు తెలిపారు. అధిష్టానం దిగి వచ్చేవరకు నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ఎట్టి పరిస్థితిలో అధిష్టానం పునర్ ఆలోచన చేసుకోవాలని ఆయన ఈ కార్యక్రమంలో మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.