నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంతో పాటు నాగేపూర్ గ్రామానికి చెందిన ముస్లిం మహిళలు, పురుషులు సుమారు 100 మంది బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీల సంక్షేమం మరిచిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.