ముమ్మరంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం

మరికల్‌: కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి చిట్టెం పర్ణికారెడ్డికి ఓటు వేయాలని మండలకేంద్రంలో బూత్‌ల వారీగా ప్రచారం జోరుగా కొనసా గుతుంది.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ హామీలు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, వద్ధులకు పెన్షన్‌, యువ వికాస తదితర పథకాలపై కాంగ్రెస్‌ కార్య కర్తలు ప్రజలకు వివరించారు. కాంగ్రెస్‌ సీని యర్‌ నాయకులు మండలంలోని మాద్వార్‌ , ఎలిగండ్ల, ఇబ్రహీంపట్నం, పెద్ద చింతకుంట రాకొండ తదితర గ్రామాల్లో మాజీ సర్పంచ్‌ నర హరి, జయసింహ రెడ్డి , మోహన్‌ రెడ్డి, పెద్ద చింత కుంటలో అంజలిరెడ్డి,కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేశారు. పూసలపాడులో కాంగ్రెస్‌ నాయకులు హర్షవర్ధన్‌ రెడ్డి, మల్లారెడ్డి, భీమ్‌ రెడ్డి ,రవికుమార్‌ రెడ్డిలు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం జోరందుకుంది. ఇబ్రహీం పట్నంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయాలని సీనియర్‌ నాయకులు సత్యనారాయణ, జనార్ధన్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు పచారం చేశారు. ఎలిగేండ్ల, పసుపుల గ్రామాల్లో మాజీ సర్పంచ్‌ హనుమంతు, మాజీ ఉపసర్పంచ్‌ చిన్న బాలు, ఆనందు, వార్డ్‌ మెంబర్‌ రామలింగప్పలు ప్రచారం చేపట్టారు. అప్పంపల్లి, మద్వార్‌, గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వెంకట్‌ రెడ్డి , మోహన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ దస్తున్న, రఘుపతి రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలు చేతి గుర్తుకు ఓటు వేయాలని జోరుగా ఇంటింటి ప్రచారం కొనసాగించారు. మరికల్‌ మండల కేంద్రంలో సీనియర్‌ మహిళా నాయకురాలు వినీతమ్మ,సూర్య మోహన్‌ రెడ్డి , కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు బీ వీరన్న, గొల్ల కష్ణయ్య, జె మల్లయ్య, యువకమండలి ఆంజనేయులు, శ్రీకాంత్‌ రెడ్డి, కష్పే మహేష్‌, వార్డ్‌ మెంబర్‌ రామకష్ణారెడ్డి, కష్‌ పే నాగరాజ్‌, జి గోవర్ధన్‌, పెంట మీది రాములు ,సత్తయ్య, మంగలి రఘు, తిరుపతయ్య, టైసన్‌ రఘు, యువ నాయకులు ప్రచారం చేశారు.
కాంగ్రెస్‌లో చేరిక..
గట్టు : మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాల లింగాపురం, ఆలూరు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు 100 మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికీ కాంగ్రెస్‌ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వాని ంచారు. కార్యక్రమంలో పాల్వాయి భాస్కర్‌ రెడ్డి, విశ్వనాధ్‌ గౌడ్‌ (అడ్వకేట్‌), వాల్మీకి నర్సింహులు, వాల్మీకి రామఅంజనేలు, కుమ్మరి జ యన్న, లాజర్‌, సోమ శేఖర్‌ గౌడ్‌, చంద్ర శేఖర్‌ గౌడ్‌, వడ్డీ రామ అంజ నేయలు, వడ్డేముని, సునీల్‌, సురేంద్ర, జయన్న, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్‌ దాఖలు..
ధరూర్‌ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ రిటర్న్‌ంగ్‌ అధికారికి నామినేషన్‌ దాఖలు అందజేశారు. ఆమె వెంబడి న్యాయవాది షఫీవుల్లా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లక్ష్మీదేవి , బండ్ల చంద్రశేఖర్‌ రెడ్డి, మధుసూదన్‌ బాబు, ఆనంద్‌ గౌడ్‌ ఉన్నారు.