– ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్
గట్టు: బహుజనులంతా ఐక్యం కావాలని ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ కోరారు. బుధవారం మండలంలోని అంతంపల్లి గ్రామంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన గొంగళ్ల రంజిత్ కుమార్‌కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ నడిగడ్డ అభివద్ధి మార్పునకు గద్వాల నియోజకవర్గ ప్రజలు ఐక్యం కావాలని కోరారు.కుటుంబపాలనలో నడిగడ్డకు ఒరిగిందేమీలేదని, బంగ్లా కుటుంబ పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. నడిగడ్డ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి సింహం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చి బాబు, జిల్లా కార్యదర్శి లవన్న, గట్టు మండల అధ్య క్షుడు బలరాం నాయుడు, ఉపాధ్యక్షుడు దయాకర్,కార్యదర్శి నరేష్ ఆయామండల , గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.