ఆగ్రో రైతుసేవ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు తలకొండపల్లి మండలం వ్యవసాయ అధికారి రాజు

నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం వెల్జాల్‌ గ్రామంలోని ఆగ్రో రైతుసేవ కేంద్రాన్ని గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల నిల్వలు మరియు ధరల పట్టిక స్టాక్‌ రిజిస్టర్‌ ఇన్వైసులు పరిశీలించినట్టు వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. ఎరువులు విత్తనాలు నీల మందులు ఎమ్మార్పీ ధరలకు మాత్రమే విక్రయించాలని, లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి రైతుకు కచ్చితంగా రసీదు ఇవ్వాలని సూచించారు. రైతులను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయరాదని తెలిపారు. కార్యక్రమంలో తలకొండపల్లి మండలం వ్యవసాయ అధికారి రాజు , శ్రీనివాస్‌ రైతు తదితరులు పాల్గొన్నారు.