కష్టజీవుల పార్టీని గెలిపించండి

Win the party of the poor– ఇల్లందులో సీపీఐ(ఎం) అభ్యర్థి దుగ్గి కృష్ణ నామినేషన్‌
నవతెలంగాణ-ఇల్లందు
సీపీఐ(ఎం) ఇల్లందు నియోజకవర్గం అభ్యర్థిగా దుగ్గి కృష్ణ గురువారం రిటర్నింగ్‌ అధికారి కాశయ్యకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో.. దుగ్గి కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల కమిటీ సభ్యులు అబ్ధుల్‌ నబి, రేపాకుల శ్రీనివాస్‌, కందునూరి శ్రీనివాస్‌, కందునూరి కవిత, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో సీపీఐ(ఎం) కార్మిక, కర్షక ఎజెండాతో ఎన్నికల్లోకి వస్తున్నదని, గెలిపిస్తే అండగా ఉంటామని తెలిపారు. సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.