8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం

 నవ తెలంగాణ- రామారెడ్డి:  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని, ధన్వంతరి మహారాజ్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యురాలు చైతన్య మాట్లాడుతూ… మన జీవితంలో ప్రతిరోజు ఆయుర్వేదాన్ని పాటిస్తూ ఏ రోగాలు రావని, మానసికంగా, శారీరకంగా, రోదనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు సురేష్, వైద్య సిబ్బంది శ్రీహరి, దోమల శ్రీధర్, ప్రభాకర్, రాజు, మహేశ్వరి, శోభ తదితరులు పాల్గొన్నారు.