
నవతెలంగాణ- నెల్లికుదురు
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గతంలో పనిచేసి బదిలీపై వెళ్లిన, అధ్యాపకులు షేక్ సమీనా, పెరుగు అనిత లకు ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఘనంగా నిర్వహించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు. శుక్రవారం బదిలీపై వెళ్లిన వారిని శాలువాలు కప్పి మెమోంటోలను అందజేసి. వారి సేవలను కొనియాడారు. తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఆరిగకూటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీ సర్వ సాధారణమని, ఉద్యోగిగా తమ విధులను చిత్త శుద్ధితో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. అధ్యాపకులు ఎక్కడ పని చేసినా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తే విద్యార్థులు తమ గుండెల్లో నిలిచి పోతారన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంలో వారి కృషి వెలకట్టలేనిదన్నారు. బదిలీపై వెళ్తున్న ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పిల్లల భవిష్యత్తు కోసమే కృషి చేశారని, కష్టపడి చదివి ఉన్నత స్థితిలో ఉండాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు, ఆధ్యాపకులు ప్రకాష్ బాబు, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మహేందర్, సుధాకర్, బాబు, యాకన్న, సతీష్, సుభాష్, స్పందన, అధ్యాపకేతర బృందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.