– వడ్డెర వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వడ్డెర వృత్తిదారులకు రుణాలివ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిలు, పల్లపు విఘ్నేశ్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డెర వృత్తిదారులు సామాజికంగా, ఆర్థికంగా నేటికి వెనకబడి ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో సుమారుగా 4000 సొసైటీలు ఉన్నప్పటికీ పైసా కూడా ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిదారులు చనిపోతే ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన వడ్డెర కుటుంబాలకు వడ్డెర బంధును ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ కోరారు. వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ముఖ్యసలహాదారులు రూపని లోకనాథం మాట్లాడుతూ ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేషన్ కార్డులు, పింఛన్లు ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుంచం. వెంకటకృష్ణ, రాష్ట్ర నాయకులు ఒడ్డన్న, కుంచంశంకర్, బొంత కొమురెల్లి, సోమయ్య, యు.ఆశోక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.