నవతెలంగాణ-గంగాధర: ఎన్నికల నిర్వాహాణ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి అని ఏసీపీ టి.కరుణాకర్ రావు పిలుపు నిచ్చారు. సోమవారం గంగాధర మండల కేంద్రంతోపాటు మధురానగర్ చౌరస్తా ప్రధాన కూడళ్లలో ఎస్సై అభిలాష్ అధ్వర్యంలో ఏసీపీ కరుణాకర్ రావు, చొప్పదండి సీఐ రవీందర్, సీఐలు, ఎస్సైలు, పోలీసులు, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. మండల కేంద్రం నుండి మధురానగర్ వరకు, చౌరస్తా కూడళ్లలో కవాతు నిర్వహించి పోలీసులు అంబేద్కర్ కూడలి వద్ద ఎన్నికల పట్ల ప్రజలకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపి కరుణాకర్ రావు మాట్లాడుతూ ఎన్నికలలో కేంద్ర బలగాలతో కలసి పోలీసులు, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియెాగించుకునేలా భద్రత కల్పిస్తూ భరోసా కల్పించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరుగకుండా కేంద్ర, రాష్ట బలగాలు శాంతి భద్రతలను కాపాడుతూ ఎన్నికలు జరిగేలా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు అభద్రత భావానికి లోను కాకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్న భయబ్రాంతులకు గురి చేసిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు.