– ఎస్ యు జేఏసీ చైర్మన్ చెన్నమల చైతన్య
నవతెలంగాణ-గంగాధర: విద్యా, వైద్య రంగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని బీఆర్ఎస్ శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చెన్నమల చైతన్య అన్నారు. గంగాధర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో సుంకె రవిశంకర్ కష్టపడి తనవంతు పాత్ర పోషించారని అన్నారు. విద్యా విషయ పరిజ్ఞానంతో విద్యార్థులు, ప్రజలు, సబ్బండ వర్గాలను ఏకం చేయడంలో రవిశంకర్ ముందున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజక వర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని, ఎడారిని తలపించిన రామడుగు, కొడిమ్యాల, గంగాధర, బోయినపల్లి, మల్యాల మండలాల్లో పచ్చని పొలాలు, పాడి పంటలు పండుతున్నాయని అన్నారు. కొండగట్టు అంజన్న దేవాలయంకు 100 కోట్ల నిధులు కేటాయించి, ఆలయ అభివృద్ధి నిర్మాణానికి సీఎం తోడ్పాటును అందించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యా, వైద్యం, వ్యవసాయ, సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన పెనుమార్పులు జరిగాయని అన్నారు. కేజీ టు పీజీ, మెడికల్ కళాశాలలు, గురుకులాలు, డిగ్రీ కళాశాలలు, మోడల్ కళాశాలలు, పాఠశాలలు, మన ఊరు-మనబడి కార్యక్రమాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఊరూరా, ఇళ్లిల్లు చేరుతున్నాయని అన్నారు. దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో అద్భుతమైన పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, జేఏసీ నాయకులు శనిగరం అరుణ్ కుమార్, గడ్డమీద రాజశేఖర్, కుందేటి సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, ములుకల విజయ్, రాగుల వినయ్, బండ అశోక్, అభిలాష్, మిర్యాల తిరుపతి, నరేష్, బండారి వెంకటేష్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.