– ముఖ్య అతిథిగా హాజరుకారున్న టీపీసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం మామునూరు లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ ప్రజా ఆశీర్వాద సభ మంగళవారం మధ్యాహ్నం నిర్వహిం చనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెఆర్ నాగరాజులు సంయుక్తంగా తెలిపారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని ఎర్రబెల్లి స్వర్ణ నివాసంలో సోమవారం వారు మీడియా సమా వేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు తనకు పూర్తి స్థాయిలో తెలుసని నాగరాజు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ దళిత బంధు అనే పథకాన్ని తన సన్నిహితులకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. చెరువులు కుంటలు మింగారని విమర్శించారు. నిజమైన ధకితులకు లబ్ధి జరగలేదన్నారు. 14 చెరువులు మింగారని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో దళితుల ఇల్లు కూల్చివేసి ఇప్పటి వరకు వారి కుటుంబాలకు నయా పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి తనకు ఒక విజన్ ఉందని చెప్పారు. వర్ధన్నపేట నియోజకవర్గం లో ఒక గ్రామంలో కూడా రోడ్లు వేయలేదన్నారు. ఐనవోలు, నందనం తదితర గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేదన్నారు. నియోజకవర్గంలో తాను ఎక్కడికెళ్లినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని చెప్పారు. ఎర్రబెల్లి స్వర్ణ నాయక త్వంలో పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఆరూరి రమేష్ పైన లక్ష మెజారిటీ తో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను అరూరి రమేష్ తన సొంత మనుషుల పేరున మార్చు కున్నారని ఆరోపించారు. ఆ భూములను రమేష్ నుంచి మళ్లీ వెనక్కి తీసుకొని దళితులకు ఇప్పిస్తామన్నారు. ఆరూరి రమేష్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కటకటాల్లోకి పంపిస్తామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించనున్న ఆశీర్వాద సభను గొప్పగా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఏఐసిసి అబ్జర్వర్ దర్మసేన , ఎల్డీఎం కోఆర్డినేటర్ కుందూరి వెంకట్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్ రావు , పింగిలి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు డా. అనిల్ కుమార్, దన్నపేట మండల బ్లాక్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.