అవినీతి కాంగ్రెస్‌ను బొంద పెట్టాలి : ఎమ్మెల్యే గండ్ర

నవతెలంగాణ-రేగొండ
రాష్ట్రంలో, నియోజక వర్గంలో బిఆర్‌ఎస్‌ ప్రభు త్వం అమలు చేసిన సంక్షేవ ు పథకాలు, అభివద్ధిని చూసి ఆశీర్వదించి మరోసారి బీఆర్‌ఎస్‌ను అత్యధిక మె జార్టీతో గెలిపించి అవినీతి కాంగ్రెస్‌ను బొందపెట్టాలని భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంక టరమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోనగల్లు, మడతపల్లి, లింగాల, పోచంపల్లి గ్రామాలలో మండల అధ్యక్షులు అంకం రాజేందర్‌ ఆధ్వ ర్యంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. గండ్ర వెంకట రమణారెడ్డి హాజరై ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్య ర్థించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణరావు అధి కార వ్యామోహంతో ప్రజలను మోసం చేసేందుకు చూ స్తున్నారని అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పేరుతో మోటార్లకు మీటర్లు పెడతామని తిరుగుతున్న బీజేపీని బొంద పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపిం చాలని అన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ నడిపెల్లి విజ్ఞాన్‌ రావు, రాష్ట్ర యుత్‌ నాయ కులు గండ్ర అభిలాష్‌ రెడ్డి, జిల్లా నాయకులు చిలుకల పాణి , స్థానిక సర్పంచ్‌ లు గంపల సుమలత భాస్కర్‌, కుసుంబ రంజిత్‌, పొరెడ్డి రమణ రెడ్డి, దాసరి నారాయణ రెడ్డి, మామిడి చెట్టి విజయ మహేందర్‌, ఎంపిటిసి కేసి రెడ్డి ప్రతాప్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.