కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అమోఘమైన అభివృద్ధిని చేసుకుందాం : సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట
వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ములుగు నియోజకవర్గం ను అమోఘమైన రీతిలో అద్భుతంగా అభివద్ధి పరుచు కుందామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం మండ లంలోనీ పస్ర, చల్వాయి మరియు మచ్చాపూర్‌ గ్రామాల్లో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకష్ణ అధ్యక్షతన క్లస్టర్‌ ఇన్‌చార్జిలు జంపాల ప్రభాకర్‌, తేళ్ల హరిప్రసాద్‌, పన్నాల ఎల్లారెడ్డి, పులుగుజ్జు వెంకన్న, గ్రామ అధ్యక్షులు సోమసాని నారాయణ స్వామి, వేల్పుగొండ ప్రకాష్‌, బద్దం లింగారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతక్క హాజరై మాట్లాడారు. మచ్చాపూర్‌ గ్రామంల భూ దాన్‌ పట్టాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. మచ్చాపూర్‌ గ్రామం నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చినవారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చల్వాయి గ్రామంలోని వడ్డెర కుల సంఘం నాయకులతో మాట్లాడారు. కుల సంఘ భవ నం నిర్మిస్తా అని, చల్వాయి గ్రామంలో భూములు కోల్పో యిన వారికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వారికి నష్ట పరిహారం గాని భూములు అందజేస్తాం అన్నారు. పా తూరు గ్రామంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్లస్థలాలు అందిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు లోపించి మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బీటలు వారడం కల్వ కుంట్ల అవినీతికి ప్రతీక అన్నారు. ఇకనైనా మోస పూరిత వాగ్ధానాలు చేసే నాయకుల్ని నమ్మవద్దని, కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రతి ఇంటికి ప్రచారాన్ని నిర్వ హించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.