రేవంత్‌ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి: కొమ్మూరి

– నేడు జనగామలో భారీ బహిరంగ సభ
నవతెలంగాణ-జనగామకలెక్టరేట్‌/జనగామ
పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పాల్గొనే స్థానిక ప్రిస్టన్‌ మైదానంలో నిర్వహించే నేటి సమర శంఖా రావం భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరై వివజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీ జనగామ నియోజకవర్గ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక గాయత్రి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనగామ నియో జకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలిరావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుండి కేసిఆర్‌ నీళ్ళు, నియామకాలు అని అబద్దాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారని, నాటి నుండి భూ కుంభకోణాలు, గనుల కుంభకెఓణాలు, ఇసుక కుంభకోణాలు చేయడమే కాకుండా తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 15 తారీఖు వచ్చినా వేతనాలు రావడం లేదని, ఎన్నికల ప్రచారంలో ఎక్కడికెళ్ళినా ఇదే విషయమై చెబుతున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి తారీఖు ఉద్యోగులకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అబద్దాలు చెబుతున్నారని, ప్రజల్లో ఆయన విశ్వాసాన్ని కోల్పోతున్నారన్నారు. జనగామ జిల్లాకు తీసుకువచ్చిన గోదావరి జిలాలలను దొంగతనంగా సిద్దిపేట జిల్లాకు తరలించుకుపోయారని ఆరోపించారు. నియోజక వర్గంలో రెండు లక్షల మంది ఓటర్లున్నారని, ఇందులో ఒక్కరు కూడా పోటీ చేసేం దుకు అర్హుడు కాదా అని, పల్ల రాజేశ్వర్‌రెడ్డి లాంటి స్థానికేతరుడిని ఇక్కడ ఎందుకు దింపుతున్నారని ప్రశ్నించారు. తాను స్థానికుడినని, గతంలో శాసన సభ్యునిగా అభివృద్ది చేశానని, ప్రజలకు అందు బాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌లు సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్‌, మాజీ ఎంపిపి ధర్మ గోవర్ధన్‌రెడ్డి, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ వంగాల మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఎంపిటిసి మెరుగు బాలరాజు గౌడ్‌, నాయకులు బడికె కృష్ణ స్వామి, జక్కుల వేణుమాదవ్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గంగరబోయిన మల్లేశం, కౌన్సిలర్‌ గాదెపాక రాంచంద్రం, కట్ట కృష్ణ, నర్సింగరావు, దాసరి క్రాంతి తదతరులు పాల్గొన్నారు.