మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తా

– 6 గ్యారంటీ పథకాలతో అండగా కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-మహాదేవ్‌పూర్‌
మంథని నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని, 6 గ్యారంటీ పథకాలతో అండగా కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు భరో సా ఇచ్చారు. మహాదేవ్‌పూర్‌ మండలంలోని అన్నారంలో సీతరామంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం నిర్వహించారు. అన్నారం, నాగపెళ్లి సెంటర్‌ పెళ్లి, మద్దులపల్లి పలుకుల, కాళేశ్వరంలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు. రాష్ట్ర ఆడపడుచులు పడుతున్న బాధలను చూసి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను ఇంటింటికి చేరవేస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభు త్వం అమలు చేస్తుందని అన్నారు. రైతులకు మెరుగైన కరెం టు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉందన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్తును కాంగ్రెస్‌ ప్రభుత్వమే అందించిందని అన్నారు. కరెంటు సమస్యలు రాకూడదని భావించి జైపూర్‌ విద్యుత్‌ ప్లాంట్తో పాటు భూపాలపల్లి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ విభజన చట్టంలో క్రిటికల్‌ అలీ సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఇక్కడ ఒక్క లిఫ్ట్‌ ఏర్పాటు చేసి రైతులకి నీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్య క్షులు ప్రకాశ్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కోటరా జబాబు, అన్నారం ఎంపీటీసీ జిల్లా ఉపాధ్యక్షులు మంచినీళ్ళ దుర్గయ్య, అన్నారం, మద్దులపల్లి సర్పంచులు రమాదేవి, సునీత, మండల అధ్యక్షులు ఎండి అక్బర్‌ఖాన్‌, యూత్‌ అధ్యక్షులు కటకం అశోక్‌, మహిళా అధ్యక్షురాలు సత్యమ్మ, కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.