నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మొండి సడక్ నుండి కామారెడ్డి వరకు ఉచిత బస్సు సర్వీస్ ను వడ్డేపల్లి సుభాష్ రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బస్సు సర్వీస్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగెంరాజు మాట్లాడుతూ.. వడ్డేపల్లి సుభాష్ రెడ్డి స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా మొండి సడక్ నుండి కామారెడ్డి వరకు ఉచిత బస్సు సర్వీసు ప్రారంభించడం జరిగింది దీన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ప్రతిరోజు ఉదయం 9:30 నిమిషాలకు మొండి సడక్ చౌరస్తాలో బస్సు ఉంటుందని ఆయన అన్నారుఈకార్యక్రమంలో గండివేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జశ్వంత్ గౌడ్, మంగలి గంగారాం, తదితరులు పాల్గొన్నారు.