పసర పంచాయితీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

నవతెలంగాణ – గోవిందరావుపేట

మండలంలోని అతిపెద్ద పంచాయితీ అయినా పసర గ్రామపంచాయతీ లో రాజకీయ సమీకరణాలు శర వేగంగా జరుగుతున్నాయి. పదివేల పై చిలుకు జనాభాతో సుమారు 7800 మంది ఓటర్లతొ పసర పంచాయతీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పంచాయతీలో పట్టు నిలుపుకునేందుకు పలు రాజకీయ పార్టీలు తనదైన పందాలో ముందుకు సాగుతున్నాయి. సి పి ఐ ఎం, బిజెపి, బి ఆర్ఎస్ పార్టీలు ప్రజా ప్రా బల్యం కోసం పావులు కదుపుతున్నారు. గతంలో ఎన్నో పర్యా యములు పంచాయితీని ఏలిన సిపిఐఎం పార్టీ కోల్పోయిన స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని పార్టీ నాయకత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. పార్టీ గేలుపే తమ లక్ష్యంగా ఇండ్లు ఇళ స్థలాలు లేని పేదలను సమీకరించి గుడిసెలు వేయించడం పోటు భూముల పట్టాలపై చేసిన పోరాటం ఎంతగానో కలిసివచ్చే అవకాశాలుగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ నాయకత్వం పసర కేంద్రంగా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడున్న గుడిసె పోరాటాలు ఈ పార్టీకి అత్యధికంగా కలిసి వచ్చే అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయని రాజకీయ అనుభవజ్ఞులైన వారు తెలుపుతున్నారు.కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంటిపోరును ఎదుర్కొంటుంది. చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పంచాయతీలో పాగా వేసింది.పంచాయతీ సర్పంచ్ దక్కినా ఈ స్థానం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ వెంటనే వచ్చిన ఎంపీటీసీ ఎన్నికల్లో మూడు ఎంపీటీసీ స్థానాలను టిఆర్ఎస్ పార్టీకి సమర్పించుకుంది. ఇక్కడే పార్టీ మైనస్ పాయింట్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి మండలంలో కంచుకోటగా ఉన్న కోటకు బీటలు వారాయి. నాటి నుండి నేటి వరకు ఇంకా పార్టీ అంతర్గత కొమ్ములాటలతో కొనసాగుతోంది. నాలుగు సంవత్సరాలు దాటిన ఒకే పార్టీకి చెందిన సర్పంచ్ ఉప సర్పంచ్ ఎడముఖం పెడ ముఖంగా పరిపాలన సాగిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ సీటును సర్పంచ్  మూలకు వేయడం తో ఇప్పటివరకు ఉపసర్పంచ్ ఆ సీట్ లో కూర్చోకపోవడం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. సొంత సమస్యను పరిష్కరించుకోలేని వారు ప్రజా సమస్యలను ఏమి పరిష్కరిస్తారు అన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. నాయకుల పనితీరు వల్లే నేను గ్రామం రెండు ముక్కలైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూతనంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకొని పార్టీని ఎలా చక్కబెడతారు అని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.  గతంలో ఎన్నో పర్యా యములు పంచాయితీని ఏలిన సిపిఐఎం పార్టీ కోల్పోయిన స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని పార్టీ నాయకత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. పార్టీ పలుపేతమే లక్ష్యంగా ఇండ్లు ఇళ స్థలాలు లేని పేదలను సమీకరించి గుడిసెలు వేయించడం పోటు భూముల పట్టాలపై చేసిన పోరాటం ఎంతగానో కలిసివచ్చే అవకాశాలుగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ నాయకత్వం పసర కేంద్రంగా దృష్టి కేంద్రీకరించింది. మూడు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని మంచి ఊపు మీద ఉన్న బి ఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి పంచాయతీ సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు తప్ప పార్టీ నాయకులు ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నారు. నూతన నాయకుల చేరికతో నూతన ఉత్సాహంతో ఉన్న బిజెపి కూడా ఈసారి ఎలాగైనా పంచాయతీని నెగ్గించుకోవాలని తాహ తహ లాడుతోంది. ఉనికిని చాటేందుకు నూతన నాయకత్వం కృషితో పనిచేస్తుంది. ఇప్పటికే ఎన్నికల కోలాహలం మొదలైన వేళ ఏ పార్టీ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందేనని ఎన్ని రాజకీయ సమీకరణాలు మారన్నాయో ఆచితూచి స్పందించాలని  పలువురు సీనియర్ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.