దొంగల పాలన దొరల పాలన పారదోలండీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

పెద్ద తడగూర్ ఎన్నికల ప్రచార సభ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మి కాంతారావు

నవతెలంగాణ- మద్నూర్: ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే ప్రతి కుటుంబం బాగుపడుతది అనుకుంటే కెసిఆర్ ఆయంలో దొంగల పాలన దొరల పాలన కొనసాగుతుందని అలాంటి పాలనకు పారదోలే సమయం అసన్నమైందని ప్రజలారా ఆలోచించండి. దొంగల పాలనకు దొరల పాలనకు పార దోలుదాం కాంగ్రెస్ పార్టీ ఆయంలో మంచి పాలన కొనసాగించుకుందాం అంటూ జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నాడు మద్నూర్ మండలంలోని పెద్ద తడుగూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి ప్రజా సమస్యలకు ఎల్లవేళల సేవలందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్దత్తడుగూరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాజు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అభ్యర్థికి భాజా భజంత్రీలతో టపాకాయలు కాలుస్తూ స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీకి జనాలు ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి కోరారు.