కళ్యాపూర్ గ్రామంలో గడపగడపకు ప్రచారం..

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామంలో గురువారం కాంగ్రెస్ నాయకులు ఒడ్డెక్క మోహన్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ముందుకు రాగా, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడతాయని ఆయన అన్నారు. గ్రామంలో ప్రతి వార్డులో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.