అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లా అయిందో ఆలోచించండి

How was Telangana then.. Think how it is now– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి టి.ప్రకాష్‌గౌడ్‌
– శంషాబాద్‌లో ఎమ్మెల్యే విస్తృత ప్రచారం
– కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నపం
– అడుగడుగునా జన నీరాజనం
నవతెలంగాణ-శంషాబాద్‌
2014 కంటే ముందు తెలంగాణ ఎట్లుందో ఇప్పుడు తెలంగాణ ఎట్లుందో ఒకసారి ఆలోచించి ప్రజలు ఓటేయా లని రాజేంద్రనగర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి టి. ప్రకాష్‌గౌడ్‌ అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్కూడ, చౌదర్‌గూడ, సు ల్తాన్‌పల్లి, కాచారం, రాయన్నగూడ, నానాజీపూర్‌, మల్కారం, కవేలిగూడ, రామంజపూర్‌, బోటిగూడ గ్రామాల్లో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. నర్కూడ గ్రామంలో జడ్పీటీసీ నీరటి తన్విరాజుముదిరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2014 కంటే ముందు తెలంగాణ అంతట విద్యుత్తు కొరతతో రైతులు అల్లాడిపోయారని అన్నారు. తాగునీటి కోసం ప్రజలు రోడ్లెక్కి కొట్టుకో వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని దూరదృష్టిలో అభివృద్ధి చేశారన్నారు. మండలంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. గ్రామపంచా యతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, డ్వాక్రా సంఘాలు, ప్రభుత్వ పాఠశాలల భవనాలు ఇలా అనేక రకాల అభివద్ధి ప నులు చేశామని తెలిపారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షా దీ ముబారక్‌ దళిత బంధు, బీసీబంధు పథకాలు అమలు చేశామన్నారు. గ్రామాలలో లింక్‌ రోడ్లు అభివృద్ధి చేయడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయని అన్నారు. బీఆ ర్‌ఎస్‌ మేనిఫెస్టోను వివరించారు. ఇప్పటికే చాలా చేశామని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని తనను గెలిపిస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జడ్పీటీసీ తన్విరాజు ముదిరాజ్‌ మాట్లాడుతూ ప్రకాష్‌గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ చిన్న ఆపద వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తున్న గొప్ప నాయకుడని అన్నారు. ఎంపీపీ జయ మ్మ శ్రీనివాస్‌ మాట్లాడుతూ అందరికీ సుపరిచితుడయిన ప్రకాష్‌గౌడ్‌ గెలిస్తేనే రానున్న ఐదేండ్లు పరిపాలన సజావుగా సాగుతుందని అన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నీలం మోహన్‌నాయక్‌, పార్టీ మండల అధ్యక్షులు కే. చంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు ఆర్‌. గణేష్‌ గుప్తా, సర్పంచులు దండు ఇస్తారి, కటికల రాజ్‌ కుమార్‌, పొగాకు రాంగోపాల్‌ కల్పనసింహారెడ్డి, మాధవి యాదగి రిరెడ్డి, దేవరకొండ రమేష్‌యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు బుర్కుంట సతీష్‌ బొమ్మ దవణాకర్‌గౌడ్‌, కే.శ్రావణ్‌కుమా ర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి మాచర్ల మోహన్‌రావు, ఉపాధ్య క్షులు ఆనెగోని శ్రీకాంత్‌గౌడ్‌, యూత్‌ మండల అధ్యక్షులు ఎన్‌. రాజశేఖర్‌గౌడ్‌, ఇందిరా కృష్ణగౌడ్‌, కె.సరిత రవీందర్‌, పీఎస్‌ఏ మాజీ చైర్మన్‌ కె.చంద్రశేఖర్‌గౌడ్‌, బాలరాజ్‌గౌడ్‌, జి. మల్లికార్జున్‌, ఎలుగని ప్రభాకర్‌ గౌడ్‌, నీరటి శేఖర్‌, సందనవెల్లి శ్రీనివాస్‌, హిరేకార్‌ శివాజీ, నీరటి మహేష్‌, అరుణ ప్రభు సాగర్‌, ఎడ్ల విటల్‌, పొగాకు రాజ్‌ కుమార్‌, మైలారం భిక్షపతి, గుండాల విశ్వనాథం, తాళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.