కాంగ్రెస్‌ గెలుపు-ప్రగతికి మలుపు

– బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేల కూలాల్సిందే
– భీంభరత్‌ ఒక్కరు కాదు.. సైన్యమంతా నా వెంటే
– బీఆర్‌ఎస్‌, బీజేపీలకు బుద్ధి చెబుదాం
– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి భీంభరత్‌
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణ ప్రజల భవిష్యత్‌ మన చేతుల్లోనే ఉందని, అందరి సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కార్య కర్తలు నడుంబిగించాల్సిన సమయం ఆసన్న మైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్‌, చేవెళ్ల నియోజకవర్గం సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం అన్నారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని ధర్మసాగర్‌, గొల్లపల్లి, కమ్మెట, ఈర్లపల్లి, ఎనికేపల్లి ఇబ్రహీంపల్లి, మీర్జాగూడ, బస్తేపూర్‌, కిష్టాపూర్‌, నాంచేరి, ఘనపూర్‌ తదితర గ్రామాలలో కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నడుంబిగిం చాల్సిన సమయం ఆసన్నమైందని, నిద్రాహారాలు మాని అవినీతి ప్రభుత్వానికి చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్‌ఎస్‌ తొమ్మిదేండ్ల పాలనల్లో అవినీతి, అక్రమాలు ,భూకబ్జాలు, పెరిగిపోయాయని, దొర తనం పెరిగి పోయిందని వాటికి స్వస్తి పలకాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ కోసం ఈ ఎన్నికలు వచ్చాయని, ఎక్కడా పొరపాటు చేయ కుండా ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసేలా కాంగ్రెస్‌ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. చేవెళ్ల నియోజకవర్గంలో గత తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ప్రశాంతమైన జీవనానికి చేవెళ్లలో కాంగ్రెస్‌ అధికారంలోనికి రావడం ఎంతో అవసరం అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలను వివరించారు. సోనియా గాంధీ, రేవంత్‌ రెడ్డి సూచించిన సూచనలను తెలియజేస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒక యుద్ధ సైనికుల్లా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చేతి గుర్తుకి ఓటు వేయించాలని చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజా ఆగిరెడ్డి, పీఎసీఎస్‌ చైర్మెన్లు దేవర వెంకట్‌రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పడాల రాములు, పార్టీ మండలాధ్యక్షులు వీరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డిశెట్టి మధుసూదన్‌గుప్తా, మాజీ సర్పంచ్‌లు దవల్‌ గారి గోపాల్‌ రెడ్డి, పడాల ప్రభాకర్‌, నర్సింలు, మాజీ ఎంపీటీసీ నరసింహరెడ్డి, పెంటయ్య గౌడ్‌, చేవెళ్ల ఉప సర్పంచ్‌ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్‌ టేకులపల్లి శ్రీనివాస్‌, డీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్‌, ఓబీసీఎల్‌ ప్రెసిడెంట్‌ సూర్యాపేట శ్రీనివాస్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జూకన్నగారి శ్రీకాంత్‌ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు దేవర సమతారెడ్డి, మహిళా మండల ప్రధాన కార్యదర్శి సరిత, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్‌, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి వెంకట్‌ రెడ్డి, పీఎసీఎస్‌ డైరెక్టర్‌ పైండ్ల మధుసూదన్‌ రెడ్డి, నాయకులు దుర్గ ప్రసాద్‌, ప్రభాకర్‌, పాండు, గోపాల్‌, పాల్గొన్నారు.