నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసిన అమ్మిన క్రిమినల్ కేసులు పీడీ యాక్ట్లు నమోదు చేస్తాం..

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
నవతెలంగాణ సిరిసిల్ల : నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసిన అమ్మిన క్రిమినల్ కేసులు పెట్టి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల మీద ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వానకాలం సాగు ప్రారంభమవుతున్న సందర్భంలో రైతన్న నకిలి విత్తనాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దీనికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని నకిలీ విత్తనాల సరఫరా ఉత్పత్తి అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ అధికారితో కలిసి ఎప్పటికప్పుడు తనిఖీలు అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఎవరైనా వ్యాపారస్తులు సంస్థలు వ్యక్తులు నకిలీ విత్తనాల విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్పెషల్ బ్రాంచ్ సిఐ కరుణాకర్ కు ఫోన్ చేయాలని లేదా డయల్ హండ్రెడ్ కు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోపికంగా ఉంచబడుతుందని తెలిపారు గతంలో నకిలీ విత్తనాలు కేసుల్లో సంబంధం ఉన్న వారిపై నిగా ఉంచాలని మళ్లీ వాళ్లు అదే తరహాలో నకిలీ విత్తనాలు అమ్మే అవకాశం ఉంటుందని అన్నారు రైతులు విత్తనాలను వ్యవసాయ శాఖ నిర్దేశించిన దుకాణాల్లో మాత్రమే ఖరీదు చేయడం మంచిదని నకిలీ విత్తనాలు పురుగుల మందులు అమ్మే వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ మాట్లాడుతూ రైతులు నగలు విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఒకటి రెండుసార్లు సరిచూసుకొని కంపెనీ ధ్రువీకరించబడిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ ఆర్గనైజర్ వద్దనే విత్తనాలు తీసుకోవాలని వాటిని రైతులు కొనుగోలు చేసేటప్పుడు ఆర్గనైజర్ నుండి రసీదు పొందాలని అలాగే తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తయ్యే వరకు రైతు ఉంచుకున్నట్లయితే ఆ విత్తనాలను సాగు చేయడం వల్ల రైతుల నష్టాలు పొందినట్లయితే తమ జీవితాలను కంపెనీని బాధితులను చేయడం జరుగుతుందని రైతు తీసుకున్న రసీదు ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీలు విశ్వ ప్రసాద్ నాగేంద్ర చారి రవికుమార్ సిఐలు ఎస్ఐలు మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.