అభివృద్ధికి పట్టం కట్టండి

అభివృద్ధికి పట్టం కట్టండి– ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి
నవ తెలంగాణ-పటాన్‌ చెరు
పోరాడి సాధించుకున్న తెలంగాణను దశాబ్దికాలంగా దేశానికి ఆదర్శంగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రతి పల్లె అభివద్ధి పథంలో పయనిస్తూ ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివద్ధి చెందుతుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసి అభివద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్‌ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీన్పూర్‌ మండలం ఐలాపూర్‌, పటాన్‌చెరు మండలం ముత్తంగి డిఎన్‌ కాలనీలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడారు. మేనిఫెస్టోలను అమలు చేయని చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శి ంచారు. మోసపోతే గోస పడే పరిస్థితులు ఉంటాయని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అధికారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డిఎన్‌ కాలనీకి చెందిన వార్డు సభ్యులు రోకియా బేగం, నాయకులు సల్మాన్‌, రాము, గడీల విజరు గౌడ్‌, వినీతా రెడ్డి, సాయి కుమార్‌, తదితరులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పిటిసి సుధాకర్‌ రెడ్డి, సర్పంచులు కష్ణ, ఉపేందర్‌, వైస్‌ ఎంపీపీ సునీత సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్‌ కుమార్‌ గౌడ్‌, మెరజ్‌ ఖాన్‌, మాణిక్‌ యాదవ్‌, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.