కెేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

కెేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలునవతెలంగాణ-నర్సాపూర్‌
నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పలు పార్టీలకు చెందిన నాయకులు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి సీఎం కేసీఆర్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్‌ కుమార్‌, నర్సాపూర్‌ ఎంపీపీ జ్యోతి సురేష్‌ నాయక్‌, బీజేపీకి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయిపల్లి గోపి, కౌన్సిలర్‌ సునీత బాల్రెడ్డి, సంగారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రాధాకష్ణ దేశ్పాండే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడిల శ్రీకాంత్‌ గౌడ్‌, తోపాటు వారి అనుచరులు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.