నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని ముదిరాజ్ గల్లి (పోచమ్మ గల్లి బొబ్బిలి వీధి) లో నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ పాదయాత్ర చేస్తూ అందరితో ఆప్యాయతగా కలుస్తూ ప్రతి ఒక్కని పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి అని ఓట్లు అడుగుతూ ఎన్నికల ప్రచారం శుక్రవారం చేశారు.ఈ సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పట్టణంలో ఏ గల్లికి వెళ్లిన ప్రజలందరూ సమస్యలతో ఏ కరువు పెడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేశామంటున్నారు. వాళ్లు అభివృద్ధి పడే అవినీతి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేశారు. బీజేపీ ఏమో అబద్ధాలు చెబుతూ నీ అకౌంట్లో 15 లక్షలు వేస్తాం లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని మాయమాటలు చెప్పి యువతను కులాల మతాల పేరిట రెచ్చగొట్టి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తుంది. యువతను రెచ్చగొట్టి ఎన్నికల్లోలబ్ధి పొందడం కాదు అని తెలిపారు. వారికి ఉపాధి ఉద్యోగ విద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. కేంద్రంలో 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేసారో చెప్పండి. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం తెలియదు. ప్రజల సొమ్ము దోచుకోవడం తన మిత్రులైన ఆదానీ అంబానీలకి పంచడం వాళ్లు బాగుపడ్డారు తప్ప దేశ ప్రజలు గాని తెలంగాణ ప్రజలు గాని బాగుపడలేదు. కాంగ్రెస్ మాత్రం మేము గెలిస్తే అభివృద్ధి చేస్తాం పేదలను ఆదుకుంటాం అని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప అవినీతిలో కాదు అని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కేసీఆర్ పాలనలో దాపురించింది. రాష్ట్రం మొత్తంలో బెల్ట్ షాపులు వైన్ షాపులు పెట్టి ప్రజలను తాగుబోతులుగా చేస్తున్నారు వాళ్లను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు అని తెలియజేశారు. మిగులు రాష్ట్రంగా తెలంగాణను అప్పగిస్తే తెలంగాణలో ఏం జరిగిందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నగర పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.