పెట్టుబడిదారులకు వత్తాసు పలికి, విశ్వగురువులమని చెప్పుకునే పాలకులే కాదు ప్రజల పక్షాన నిలబడవలసిన పాత్రి కేయులు శేఖర్ గుప్తా లాంటి వాళ్లు కూడా ”సంపద సృష్టికర్తలు బడా కార్పొరేట్లు” అని దురదృష్టవశాత్తు సెలవిస్తారు. మరి అలాంటప్పుడు, పాలస్తీనీయులను తుద ముట్టించి శ్మశానా న్ని తలపించేలా అక్కడి భూభాగాన్ని తయారు చేసిన ఇజ్రాయిల్ పాలకులు భారతదేశం నుండి లక్ష మంది కార్మికులు కావాలని అర్జీ ఎందుకు పెట్టుకున్నారు? భూమిని భుక్తిగా మార్చగలిగిన శక్తి కేవలం కార్మి కులకే ఉందన్నదని ఎప్పటికైనా గుర్తించాల్సిందే! అ యితే భారతదేశం నుండే కార్మికులు కావాలని ఎం దుకు అడిగినట్లు? సమాధానం చాలా సింపుల్. భార తదేశ కార్మిక వర్గం కిమ్మనకుండా ఇచ్చినంత తీసుకొని కావలసినంత పనిచేసి పెట్టగలదు. చరిత్రలో జార్ చక్రవర్తుల నుండి మొదలు, అనేకమంది రాజులు, రారాజులు మనుషులను బానిసలుగా చూసిన సంఘ టనలు అనేకం. విద్యుత్‌కు అంతరాయం కలిగినప్పుడు ఖైదీలు గా ఉన్న వారందర్నీ కట్టగట్టి కిరోసిన్ పోసి వెలిగించి ఆ వెలుగు లో భోజనం చేసిన సంఘటనలు నీరో చక్రవర్తి కాలంలో జరిగా యని చరిత్ర చెబుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయం లో భారతదేశానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధము లేదు. కానీ బ్రిటీష్ వారి ఆదేశాల మేరకు సుశిక్షితులైన భారత సైనికులను ఎంతోమందిని జర్మనీ పంపించి పొట్టనబెట్టుకున్నారు. అంతెం దుకు 30,40 ఏండ్ల క్రితం వచ్చిన సినిమాలలో భారతదేశం నుండి రంగూన్‌కి, అండమాన్ నికోబార్ దీవులకి, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకి మనుషులను శాశ్వతంగా తరలించుకు పోయి బానిసలుగా పని చేయించుకొని వయసు పైబడగానే సజీవంగా నీళ్లలో పడేయడమో లేదా మట్టిలో పూడ్చి వేయ డమో చేయడం అనేక సినిమాల్లో చూశాం. ఇలాంటి ఘటనల నేపథ్యంలోనే ఇజ్రాయిల్ పాలకుల కోరికను చూడవలసి ఉంటుంది. అందుచేతనే కాబోలు భారత కార్మిక వర్గంలోని ప్రధాన వామపక్షం ఈ వినతిని పూర్తిగా ఖండించింది. కానీ కొందరు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పాడే వాళ్లు, పాలకవర్గం లోని పెట్టుబడిదారుల అనుయాయులు ఇజ్రాయిల్ ఆహ్వానాన్ని ఒక అవకాశంగా చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఈనాటి ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదానికి కారణం కూడా ఒకనాడు ఇలాంటి వలసలను ప్రోత్సహించి, కొందరిని అక్కడికి పిలిపించి స్థావ రాలు ఏర్పరచడం వల్లనే అనేది దాచేస్తే దాగని సత్యం. వివాదాస్పద ప్రదేశానికి అమాయక ప్రజ లను ఉపాధి ఆశ చూపి పిలిపించి బలిజేసే కుట్రలో భాగమే ఇది. పిలిపించిన, పంపించిన ప్రభుత్వాలు, అధికారులు ఎలాంటి బాధ్యత వహించే అవకాశం ఉండదు. అధికారికంగా వీసాలు పొంది అమెరికా, సౌదీ అరేబియా, దుబారు లాంటి ప్రాంతాలలో ఉపా ధిపై వెళ్లిన వారిలో అనేకమంది జైళ్ళల్లో మగ్గుతు న్నారు. ఈ సంఖ్య వేలల్లో ఉన్నది. చేయని నేరాలకు చిన్న చిన్న తప్పులకు అనేకమంది ఆయా దేశాల చట్టాల ప్రకారం జైళ్ళల్లో ఇరుక్కుపోయారు. ఇక్కడ నివసిస్తున్న వారి కుటుం బాలు ఎంతలా మొరపెట్టుకున్నా యంత్రాంగం పట్టించుకోని సంఘటనలు ఎన్నో ఉన్నవి. ప్రపంచీకరణను అక్కున చేర్చు కున్న భారత పాలకులు, తెలియని భ్రమలతో వారిని అభి మానించే ప్రజలు, ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆంగ్లే యులు ఇండియాను పరిపాలించినప్పుడు ఇక్కడి నుండి ముడిసరుకు తీసుకొని వెళ్లి తయారైన వినియోగ వస్తువులను మళ్లీ ఇక్కడికి తీసుకువచ్చి వ్యాపారం చేసేవారని చదువు కున్నాం. మరి దాని అర్థం ఏమిటి? అంటే.. ఇక్కడ మనుషులు ఇక్కడి వస్తువులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ వినియోగ వస్తువులను తయారు చేయాలి వాటిని ప్రపంచమంతా మార్కెట్ చేసుకోవాలి. ఎక్కడైతే వస్తువులు తయారు చేయబడ తాయో ఆ దేశానికి సదరు వస్తువులు చౌకగా లభిస్తాయి. పరిశ్రమలు స్థాపించుకోవడం వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక ప్రభుత్వాలకు కావలసినంత ఆదాయం పన్ను రూపంలో లభిస్తుంది. ఇప్పుడు కూడా జరుగుతున్న తతంగం ఇదే. లక్షల మంది టాలెంట్ గలిగిన యువత భారతదేశం నుండి విదేశాలకు తరలిపోతుంటుంది. ఎందుకు? ఎందుకంటే అక్కడ పరిశ్రమలను స్థాపించు కున్నారు. గుర్తు పెట్టుకోండి.. సంస్థలు, ప్రపంచ ఆధిపత్యం సాధిస్తున్న దేశాలు. పరిశ్రమలు నెలకొల్పాలంటే కార్మికులు పుష్కలంగా లభించాలి. భారతదేశంలో కార్మికులు ఉన్నప్పటికీ వీరిని వీసాలకు తీసుకువెళ్లి అక్కడ సంస్థలు స్థాపించుకొని అక్కడ దేశాలకు పన్నులు కట్టించుకుని కార్మికులకు మాత్రం ముష్టి పడవేస్తున్నారు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందు తున్న దేశాలలో నెలకొల్పబడుతున్న కార్పొరేట్ కంపెనీల ఆఫీసు లన్నీ కేవలం శాటిలైట్ ఆఫీసులో లేదా అవుట్‌లెట్ విభాగాలకు చెందినవి మాత్రమే. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, కెనడా, కొరియా వంటి దేశాల్లోనే ఉత్పాదక యూనిట్లు వున్నవి. కార్ల తయారీ కంపెనీ కియా అనంతపురంలో అసెంబ్లీ ఫిటింగ్ యూ నిట్ ఏర్పాటు చేస్తే వేల మందికి ఉపాధి లభించింది. అదే ఉత్పత్తి కంపెనీ ఏర్పాటు చేస్తే మరెంతమేర అభివృద్ధి జరుగునో ఊహించండి. ”భారత మా ర్కెట్ వినియోగ మార్కె ట్- భారత కార్మికులు ఉపయోగపడే మనుషులు” అనే విధం గా ప్రపంచ దేశాల పోకడ ఉన్నది. మొన్న చంద్రయాన్ సఫల మైన సందర్భంగా భారతదేశం నుండి ప్రధాన విద్యా సంస్థల్లో చదువుకుని నిష్ణాతులైన వారందరూ విదేశాలకు వెళ్ళి పోతే మిగతావారు మాత్రమే ఇస్రోలాంటి చోట పనిచేస్తున్నారని వార్త మాధ్యమాలు వేలెత్తి చూపేయి. అయితే భారతదేశంలో చెల్లించ బడుతున్న వేతనాల కంటే విదేశాల్లో రెట్టింపుకు పైగానే ఉన్నం దువల్ల అట్లాంటి మేధో సంపత్తి తరలిపోతున్నది. స్థానికంగా పరిశ్రమలను నెలకొల్పడమే దీనికి సరైన సమాధానం.
ఆశ్రిత పెట్టుబడిదారీతనాన్ని ఆసరాగా చేసుకుని అందల మెక్కిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి పరిశ్రమల స్థాపనపై, భారత మేధోసంపత్తి తరలిపోతున్న అంశంపై మాట్లా డకుండా వారానికి 70 గంటలు యువత పనిచేయాలని విసు ర్లు విసరడంతో పెద్ద దుమారమే రేగింది. ఎన్ని గంటలు అన్నది కాదు మనుషుల శక్తిని పూర్తి మొత్తంగా గ్రహించుకోగల సంస్థల స్థాపన నేటి అవసరం. వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ దేశ నగసత్యం ఏమంటే ఎక్కువ గంటలు పనిచేసిన వారందరూ కడుపేదలుగా మిగిలిపోతు న్నారు. వ్యవసాయ సంబంధిత వ్యవహారాలపై ఆధారపడిన వారు రోజుకు కనీసం 16 గంటలు పని చేస్తున్నారు. వారం దరూ అత్యంత పేదలు. అసంఘటిత రంగంలోని కార్మికులం దరూ 12 గంటలు పని చేస్తున్నారు. వారందరి జీవితాలు తెల్ల రేషన్ కార్డును దాటి ముందుకు పోవడం లేదు. తెల్లకాలర్ తో 6-8 గంటలు పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలు కాస్త మెరుగ్గా ఉన్నవి. నీలిరంగు చొక్కాలతో చలువ కళ్లద్దాలతో చకచకా వ్యవ హారాలను చక్కబట్టే వాళ్లు కోటీశ్వరులు. నలగని ఖద్దరుతో నలు గురిపై ఆధిపత్యం చెలాయిస్తున్న వారంతా రాజకీయ పెట్టుబడి దారీ కుమ్ముకైన వర్గం. ఇప్పుడు చెప్పండి జీవితాలను భవిష్య త్తును నిర్ణయించేది పని గంటలా, పైరవీలా? పైరవీలకు చరమ గీతం పాడి పరిశ్రమల్ని నెలకొల్పి ఆ పరిశ్రమలలో కావలసిన నైపుణ్యాన్ని అనువుగా వినియోగించుకునే వ్యవస్థీకృత అంశాలను వదిలి ఉపరితలపు ఉన్నతి కోసం ప్రయత్నిస్తే నిరుపయోగమే.
గత సంవత్సర కాలంగా దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మాంద్యం పరిస్థితులు నెలకొన్నవి. కొన్ని ప్రధాన కంపెనీలు లేఆఫ్‌లనూ ప్రకటిస్తున్నాయి. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, కెనడా వంటి దేశాలకు ఉన్నత విద్యకోసం వెళ్ళిన విద్యా ర్థులు కావలసిన ఉపాధి లభించక దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు. యూనివర్సిటీల మనుగడ కోసం కావలసినన్ని వీసాలు మంజూరు చేసి తదనంతర ఉపాధిపై ఏమాత్రం శ్రద్ద పెట్టడం లేదు. విద్యార్థులను విదేశాలకు పంపిం చిన ఇక్కడి ప్రభుత్వాలు కూడా సదరు విద్యార్థుల భవిష్యత్తుపై పట్టించుకోవడం లేదు. ఎఫ్ వన్ వీసాల గడువు ముగుస్తుందని కొందరు, హెచ్ వన్ వీసాలు దొరకడం లేదని ఇంకొందరు దిగు లుతో ఉన్నారు. ఇలాంటి వారి భవిష్యత్తే అగమ్యగోచరమైన ప్పుడు ఇక ఇజ్రాయిల్ దేశం వెళ్ళాల్సిన లక్ష మందికి ఏ కార్మిక చట్టాలు అమలౌతాయో, జీతభత్యాల విధివిధానాలేమిటో కొంత కాలం గడిచిన తరువాత గాని స్పష్టమవదు.
జి.తిరుపతయ్య
9951300016