బాలల దినోత్సవాలు ఎవరి కోసం?

 Neti Vyasam నవంబర్‌ 14 బాలల దినోత్సవం ప్రతి ఏటా మొక్కు బడిగా జరుపుకోవటం ఆనవాయితీగా మారిపోయినది. ఈ సందర్భంగా బాలలు వారి హక్కుల గురించి విశ్లేషించు కుందాం! ఫ్రాన్స్‌ రాజనీతిజ్ఞుడు జె.జె.రూసో ”స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్ళలో బంధింపబడి ఉన్నాడు” అని వ్యాఖ్యానించాడు. ఇది అందరికి వర్తిస్తుంది. చరిత్ర గమనాన్ని పరిశీలిస్తే ఒక్క ఆదిమ కమ్యూనిస్ట్‌ వ్యవస్థ తప్ప మిగతా అన్ని దశలకు రూసో వ్యాఖ్య వర్తిస్తుంది. అందుకే ఆధునిక ప్రజాస్వామిక సమా జాలు స్వేచ్ఛను, హక్కులను గుర్తిస్తూ రాజ్యాంగ పరమైన రక్షణలు కల్పించబడ్డాయి. వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు ప్రాథమిక హక్కులు పెట్టనికోట. భారత ప్రజాస్వా మ్యానికి ఇవి పునాది రాళ్లు. ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగానికి ‘మాగ్నాకార్ట’గా పేర్కొంటారు. ‘మనిషి అవసరాలే మనిషి హక్కులు’ జీవి పుట్టుకతో వచ్చిన హక్కులు అత్యంత సహజ సిద్దమైనవి. బాలల హక్కులు కూడా మానవ హక్కులేననే స్పృహ పెరుగుతూ వచ్చిన క్రమంలో 1959లో ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ప్రకటన చేసింది. ఈ ప్రకటన బాలల హక్కులకు ‘మాగ్నా కార్టా’గా చెప్పవచ్చు. దీని సారాంశం బాలలు, జాతి, లింగ, రంగు, భాష, మతం, జాతి, ఆస్తి, పుట్టుక తేడా లేకుండా అన్ని హక్కులకు అర్హులు. స్వేచ్ఛ గా, గౌరవంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, నైతికంగా ఎదగాలి. అందుకు సంపూర్ణ అవకాశాలు కల్పించ బడాలి. సరైన పోషక ఆహారం, గృహ వసతి, వైద్యసేవలు పొందేహక్కు వుంది. పిన్న వయస్సులో ఎంతో అవసరమైతే తప్ప తల్లి నుండి వేరు చేయరాదు. పేద పిల్లలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. వారు ఉచిత, నిర్భంధ, విద్య పొందటానికి అర్హులు. జ్ఞానం, సమాజానికి ఉపయోగపడే పౌరుడు అవటా నికి ఆస్కారమిచ్చే విద్యను ప్రభుత్వం అందించాలి. ఆటలు, వినోదం పొందటానికి పూర్తి అవకాశాలు పిల్లలు పొందాలి. ఈ హక్కును పొందటానికి సమాజం, ప్రభుత్వం చొరవచూపాలి. అన్ని రకాల నిర్లక్ష్యం, క్రూరత్వం, దోపిడీల నుండి బాలలకు రక్షణ లభించాలి. ఏరకమైన అక్రమ రవాణాకు వారు గురి కాకూడదు. అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అయినా అనేక దేశాలలో ఈ ప్రకటనలోని అనేక అంశాలు అమలుకు నోచుకో లేదు. 20వ శతాబ్దంలో మానవ హక్కుల చట్టబద్దత ప్రస్థావనలో బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పిం చుటకు ‘ఎగ్‌ లెంటిన్‌ బెగ్‌’ అనే ఉపాథ్యాయురాలి చొరవతో ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక చర్చ జరిగింది. 1989 నవంబర్‌ 20న ఐక్య రాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడికలో 180 దేశాలు సంత కాలు చేశాయి. ఈ అనేక ప్రయత్నాల మూలంగా ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ బాలల హక్కుల ఒప్పందంను నవంబర్‌ 20 1989న ఆమోదించినది. ఆ నాటి నుండి నవం బర్‌ 20 తేదిని ‘బాలల హక్కుల పరిరక్షణ దినం’గా గుర్తిం చారు. భారత ప్రభుత్వం 1992 డిసెంబర్‌ 11 న సంతకం చేసి బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది.
భారత రాజ్యాంగం బాలల హక్కులకు హామి ఇచ్చింది. కాని ఆచరణలో అవి అమలుకు నోచుకో లేదు. 1992లో మోహిని జైన్‌ ఉన్నికృష్ణన్‌ కేసులో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు గుర్తించింది. అప్పుడు మేల్కొన్న కేంద్ర ప్రభు త్వం విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తూ 2002 లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘విద్యా హక్కు బిల్లు 2005’ ను ఆమోదించింది. అయితే 6-14 సం||ల వయస్సు గల పిల్లలకు మాత్రమే విద్యాహక్కు పరి మితం చేస్తే సరిపోదు. రాజ్యాంగంలో 4వ భాగం లో 45వ అధికరణ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య ను కూడా, హక్కుగా చేయాలి. ఈ బిల్లు రాజ్యాం గంలోని ఆదేశిక సూత్రాలలోని ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య’ను ప్రాథమిక హక్కుగా మార్చినది. అందుకు రాజ్యంగం లోని 21వ అధికరణ అయిన జీవించే హక్కును 21-ఏను చేర్చి ‘జ్ఞానంతో జీవించాలని’ అనే అర్థాన్ని ఇచ్చింది. ఈ చట్టం 2010 ఏప్రిల్‌ 1న అమలులోకి వచ్చినది. దీనిలో పాఠశాల విద్యకు దూరంగా ఉన్న 7 కోట్ల మంది పిల్లలను బడిబాట పట్టించాలని వారికి మంచి ప్రమాణాలతో కూడిన ఉచిత నిర్బంధ విద్యను అందించాలని, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రవేటు విద్యా సంస్థలలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలసి 55:45 నిష్పత్తిలో వచ్చే ఐదేండ్లలో ఈ లక్ష్య సాధనకు రూ.1,71,000కోట్లు వెచ్చించాల్సి వుందని లెక్క తేల్చారు.
వసతులు లేని తరగతి గదులు, అందుబాటులో లేని పాఠ్య పుస్తకాలు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎప్పటిలాగే పాఠ శాలల్లో కనీస వసతులైన మంచినీరు, మరుగుదొడ్లు లేవు, క్రీడా స్థలాలు లేవు. అసలు పాఠాలు చెప్పటానికి తగినంత మంది ఉపాధ్యాయులే లేరు. పైగా ఉపాధ్యాయులపై, పాఠశాల నిధు లపై అజమాయిషిని పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ లకు అప్ప జెప్పినారు. తల్లిదండ్రులను ఉపాధ్యాయులను శిక్షించే నియ మాలు పొందుపరచారు. 25శాతం సీట్లు పేద వర్గాల పిల్లల కేటాయింపును వ్యతిరేకిస్తూ ప్రయివేటు పాఠశాలల యాజమా న్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ కేటాయిం పును సమ ర్థిస్తూ ధర్మాసనం 2012 ఏప్రిల్‌లో తీర్పు చెప్పింది. అసలు 25శాతం సీట్ల కేటాయింపు ప్రతిపాదన అనవసరమైనది ఇది కేవలం ప్రయివేటు స్కూళ్ళ యాజమాన్యాలను ధనవంతులను చేయటానికే. ఆ పిల్లల ఫీజులను ప్రభుత్వం ఎందుకు ప్రవేటు పాఠశాల యాజమాన్యాలకు చెల్లించాలి? ఈ రకమైన లోపా లతో ఈ చట్టం అమలులోకి వచ్చి ఏండ్లు గడుస్తున్న పాఠశాల విద్యాహక్కులో పొందుపరచిన వివిధ అంశాలు ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు ప్రయివేటు రంగంలోని విద్యా సంస్థలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దోచుకొంటున్నాయి. ప్రయి వేటు పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో ఫీజులతో పాటు, స్కూల్‌ వద్దే యూనిఫాంలను, పుస్తకాలు, డైరీ, బెల్ట్‌ కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకు వచ్చి తల్లిదండ్రుల వద్ద నుండి పెద్దమొత్తంలో డబ్బులు గుంజుకొం టున్నాయి. ఇంత చెల్లించిన ప్రయివేటు పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు అర్హత ఉన్న ఉపాధ్యాయులు కాని, సరైన మౌలిక వసతులు కాని కల్పించటం లేదు. విద్యార్థులను ఉద యం నుంచి సాయంత్రం వరకు 10 గంటలకు పైగా తరగతి గదులలో బంధించి ‘ఎద్దు మొద్దు’ ‘ఎద్దు మొద్దు’ అనే బట్టీ పద్ధ తులలో బలవంతంగా బోధించటం వల్ల పిల్లల సృజనాత్మక, జ్ఞానం, చైతన్యం, సమాజం పట్ల బాధ్యత పూర్తిగా లోపించి యాంత్రికంగా తయారవుతున్నారు. కొన్ని సంద ర్భాలలో పిల్లలను భౌతికంగా కొట్టటం, హింసించటం వంటి అమానవీయ పద్ధతులలో వారిని అవమానించటం జరుగు తుంది. క్రీడా మైదానాలు, విశాలమైన తరగతి గదులు లేవు. ఇరుకు భవనాలలో పాఠశాలలు నడుపుతున్నారు. శాస్త్రీయ విద్యావిధానం కాకుండా బట్టీవిధానాన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ అసంబద్ధ విధానాలు బాలల హక్కులను పూర్తిగా కాలరాస్తూ భావి భారత పౌరులను నిర్వీర్యం చేస్తున్నాయి. ఫలితంగా శారీరక వికాసం లేక చిన్న వయస్సులోనే అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు, మధు మేహం, బి.పి. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతూ తక్కువ వయస్సులోనే జీవితాన్ని చాలించే దశకు చేరు కుంటున్నారు. ఈ పరిణామాలన్ని బాలల హక్కుల ఉల్లంఘన కిందే పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి నుండి, ఈ బాలల హక్కుల ఉల్లంఘన నుండి బాలలను కాపాడే బాధ్యత మేధావి వర్గం, పౌర సమాజంపై ఉంది. మొత్తం విద్యావ్యవస్థను ప్రక్షా ళన చేయాలి. బాలల హక్కులు పరిరక్షిం చాలన్న వారు స్వయం సంపూర్ణంగా ఎదగాలన్న ప్రక్షాళన తప్పదు. సృజనాత్మకత, నైపు ణ్యం, విజ్ఞానం, పరిజ్ఞానం, పరిశోధన ప్రజా అవసరాలకు అను గుణంగా ఉండే విద్యా విధానం ఉండాలి. భారమైన విద్యా బోధన కాకుండా విద్యార్థి స్వేచ్ఛగా జ్ఞానం సముపార్జించుకొనే శాస్త్రీయ విద్యావిధానం ప్రవేశ పెట్టిలి. విద్యా వ్యవస్థ వారి వారి మాతృ భాషలలో జరగాలి. ఇందుకు మొత్తం సమస్త జ్ఞాన సంపదను దేశీయ, ప్రాంతీయ భాషలలో తర్జుమా కావాలి. ప్రభుత్వ, ప్రవేటు అనే రెండు రకాల విద్యా వ్యవస్థలు, మీడి యంలు లేకుండా ప్రజలందరికి పేద, ధనిక, తేడాలు లేకుండా ఒకే రకమైన విద్యవ్యవస్థను సూచించిన డా||డి.యస్‌. కొఠారి చెప్పిన (కొఠారి కమిషన్‌ 1964-66 సిఫార్సులు) ‘కామన్‌ స్కూల్‌’ విధానంను ప్రవేశపెట్టాలి. ఈ విధానంలోని పాఠశా లలో దేశ ప్రధాని మొదలు ముఖ్యమంత్రి, టీచర్లు, రిక్షాపుల్లర్ల వరకు తమ పిల్లలందరిని ఆవాస ప్రాంతంలోని పాఠశాలలో చదివించగలిగితే నెహ్రూజీ కలలు కన్న నిజమైన దేశ భవి ష్యత్తు తరగతి గదులలో నిర్మించబడుతుంది. పిల్లలు పుష్పాల్లా వికశించాలే గాని వారిని మొగ్గల్లోనే చిదిమేస్తే ఈ దేశ భవిస్యత్తు ఏమి కావాలి? ఇప్పటటికే చాలా నష్టం జరిగింది, జరుగుతూ వుంది. స్వాతంత్య్రం వచ్చాక పదేళ్ళలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని నిర్దేశించుకొన్నాం. ఏడు దశాబ్దాలు దాటినా లక్ష్య సాధనకు దూరంగా ఉన్నాం. ఇప్పటికీ సుమారు 8 కోట్ల మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారంటే మనం ఎక్కడ వున్నాం! దీని గురించి చర్చ జరగాలి. మేధావులు, పౌర సమాజం, ఉపా ధ్యాయ వర్గం స్పందించాలి. లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు.
షేక్‌. కరిముల్లా
9705450705

Spread the love
Latest updates news (2024-05-09 18:34):

cbd gummies for kids V8v with adhd | 4NQ green apple gummies cbd | kangaroo cbd uvS gummies 2000mg reviews | are cbd gummies DHF safe | kana XIs cbd gummies cost | royal cbd gummies where to iKO buy | 1 DGJ 1 thc cbd gummies | what is hq1 pure cbd gummies good for | heavenly candy cbd gummy Lft worms | biogold 4EL cbd gummies walmart | what is the dhI strongest cbd gummies for pain | 100 mg cbd gummy aOJ bears | 04R fern britton cbd gummies uk | cbd 3sR chill gummies 5 pack | cbd christmas gummies online sale | Nw2 wyld 500mg cbd gummies | ripper magoo cbd gummies f2e | how much 0l6 does eagle hemp cbd gummies cost | BHj cbd gummies st louis mo | cbd gummies with zcL thc in them | cbd MHb gummies active ingredients | cbd vape yumi gummies cbd | cbd green cbd vape gummies | green Qag ape cbd gummies for gout | high cbd gummy free trial | cbd gummies VSI dot drug test | z5c best cbd gummies that are on the market thc free | smilz AJg cbd gummies coupon code | best sleep cbd gummies TAD | who D7v developed smilz cbd gummies | power cbd Brd gummies reviews | cbd gummies drug test rwI results | DWC next plant cbd gummies review | are cbd gummies ltG good for anxiety | sleep kb6 aid cbd gummies | goli cbd gummies for sale | beneficios de cbd O79 gummies | how much hkF cbd per gummy natures tru cbd | where can i buy green otter 694 cbd gummies | best cbd isolate gummies for anxiety oAm | official cbd gummies amazin | kenai farms cbd gummies j8V where to buy | cbd online shop gummies medsbiotech | 6JX jamie richardson cbd gummies | revolution cbd gummie aSE bears | delta free trial cbd gummy | hemp cbd gummies australia Uy0 | best B9a gummies with thc and cbd | cachet cbd low price gummies | greenroad free trial cbd gummies