మతం ఊతకర్రల్ని దోపుకుని వచ్చిన ‘దేశభక్తి’

12 మే 1940లో పశ్చిమ బెంగాల్‌, ఝర్‌గ్రాంలో జరిగిన బహిరంగసభలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ ఈ దేశ ప్రజలనుద్దేశించి చెప్పిన మాటల్ని మనం ప్రస్థుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సి ఉంది…”హిందూ మహాసభ తమ సన్యాసులను, సన్యాసినులను తెచ్చి, పెద్ద ఎత్తున రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. వారు ఓట్లు అడుగుతూ తిరుగుతున్నారు. వారు కనబడగానే హిందువులంతా ఒక పవిత్ర భావనకు లోనై, శిరస్సు వంచి నిలబడుతున్నారు. అది హిందూ మహాసభ వారికి బాగా ఉపయోగపడుతూ ఉంది. హిందువులంతా ఈ విషయాన్ని ఖండించాలి. ఆధ్యాత్మిక వాదులకు రాజకీయాలతోనూ, ఓట్లతోనూ పనేమిటీ? మత విశ్వాసాలు తెచ్చి రాజకీయాలకు పులమడం వల్ల, ఇప్పుడే కాదు, రాబోయే కాలాలలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ప్రజలందరూ దీన్ని గుర్తించాలి. అప్రమత్తంగా ఉండాలి. ఏ మతమైనా సరే, దాని పరిధిలో దాన్ని ఉండనివ్వాలి. అతిక్రమిస్తే మాత్రం సహించకూడదు” దార్శనికుడైన నేతాజీ, ఎనభైయేండ్లకు ముందే నేటి సమకాలీన పరిస్థితిని పసిగట్టారు. ‘అతి సర్వత్ర వజ్రయేత్‌’ అన్నది ఆర్యోక్తి. కానీ, వారు చెప్పిన దానికి విరుద్ధంగా వారే- బ్రాహ్మణార్యులు, బ్రాహ్మణిజాన్ని నెత్తిన మోస్తున్న బ్రాహ్మణేతరులు కలిసికట్టుగా ఈ దేశంలో అతిగా ప్రవర్తించారు. ఇప్పటికీ ప్రవర్తిస్తున్నారు. ఒకప్పటి హిందూ మహాసభ ఇప్పుడు లేదని అనుకోవద్దు. ఆర్‌ఎస్‌ఎస్‌ – బీజేపీలు దాని శాఖలే!
CNN – పోల్‌ ప్రపంచంలోని అత్యంత అవినీతి మయమైన పది రాజకీయ పార్టీల జాబితాను విడుదల చేసింది. అందులో మన దేశంలోని అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి నాలుగోస్థానం లభించింది. ఈ లిస్ట్‌లో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ – నవాజ్‌కు PML (N) మొదటి స్థానం, నేషనల్‌ రెసిస్టెంట్‌ మూవ్‌మెంట్‌, ఉగాండాకు రెండోస్థానం, ప్రొగ్రసివ్‌ యాక్షన్‌ పార్టీ – క్యూబాకు మూడోస్థానం దక్కాయి. ఆ తర్వాత నాలుగోస్థానం మనదేశంలోని బీజేపీదే. అయితే, కొమింటాంగ్‌ ఆఫ్‌ చైనా, నేషనలిస్ట్‌ ఫాసిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇటలీ వంటివి కూడా అవినీతి రాజకీయ పార్టీల జాబితాలో ఉన్నాయి. దేశంలో బీజేపీ వారు చేస్తున్న అరాచక కార్యక్రమాలు రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మీడియాను మోడీ ఎంతగా కొనేసినా ఇంకా నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్న వారు కొంత మందైనా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో అల్లర్లు సృష్టించిన ఏడుగురు బీజేపీ కార్యకర్తల్ని సి.సి. ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారు మహేశ్‌కుమార్‌ మిశ్రా, ప్రత్యూష్‌ శ్రీవాస్తవ, నితిన్‌కుమార్‌, దీపక్‌ కుమార్‌ గౌడ్‌, బ్రిజేష్‌ పాండే, శతృఘ్ను ప్రజాపతి, విమల్‌ పాండే వీరు ముస్లిం టోపీలు ధరించి, ముస్లింల వేషధారణలో అయోధ్యలోని మసీదు వెలుపల అభ్యంతరకరమైన పోస్టర్లు అంటించారు. ఖురాన్‌ ప్రతుల్ని విసిరేశారు. ముస్లింలను నిందిస్తూ, ముస్లింలను దోషులుగా ప్రచారం చేస్తూ ముస్లింల వేషధారణలో అల్లర్లకు పాల్పడింది బీజేపీ కార్యకర్తలేనన్నది స్పష్టమైంది.
గడ్డం పెంచుకున్నంత మాత్రాన ఎవరూ రవీంద్రనాథ్‌ టాగూర్‌ అయిపోరు. అలాంటప్పుడు మరి ఇతనేనా మన విజయవంతమైన ప్రధాన మంత్రీ? సర్దార్‌ పటేల్‌ విగ్రహానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కార్పొరేట్లకు అయిదు లక్షల యాభై అయిదు వేల కోట్లు రుణమాఫీ చేశాడు. ప్రధాని తన విదేశీ యాత్రలకు 25వేల కోట్లు బీజేపీ పార్టీ ఆఫీసుకి రూ.350 కోట్లూ, తమ పార్టీ వ్యాపార ప్రకటనలకు 500కోట్లు, ప్రధాని సెక్యూరిటీ 591 కోట్ల 30లక్షల ఖర్చు వస్తూ ఉంది. గడచిన ఐదేండ్లలో కుంభమేళాలకు 500కోట్లు, ట్రంప్‌కు నమస్కారం చెప్పడానికి వందకోట్లు ఖర్చు చేశాడు. ఇతని వల్లనే కదా ద్రవ్యోల్బణం పెరిగిందీ? ఇతని వల్లనే కదా పెట్రోల్‌, డిజిల్‌, గ్యాసు సిలెండర్‌ ధరలు ఊహించలేనంతగా పెరిగాయీ? గడచిన 30-40 సంవత్సరాలలో ఏనాడూ ఇంతమంది సైనికులు చనిపోలేదు. ఈయన గారి అధ్వాన్నపు పాలన ఎలా ఉందో చెప్పడానికి ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలీ? అంటూ ప్రతిపక్ష నేతలు పార్లమెంట్‌లోనే అనేకసార్లు గగ్గోలు పెట్టారు. సంసద్‌ టి.వి., ఇతర జాతీయ టెలివిజన్‌ చానళ్ళ ద్వారా దేశ ప్రజలు అన్నీ గమనిస్తూ వచ్చారు. తమ ‘మన్‌కి బాత్‌’ అక్కడ ప్రతిపక్షాలు గొంతెత్తి చెపుతున్నాయని అనుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం చేసింది సంసద్‌ టి.వి.యే గనక, అది అధికార ప్రకటననే – అని దేశ ప్రజలు భావించారు!
కర్నాటకలో విద్వేష ప్రసంగాలకు బీజేపీ నాయకులు ఆజ్యం పోస్తున్నారు. కర్నాటక బీజేపీ చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కాతిల్‌ – ”టిప్పు సుల్తాన్‌ అభిమానులు ఈ దేశంలో ఉండటానికి వీలులేదు. వారిని వెంటాడి వేటాడి చంపేయండి. లేదా అడవి ప్రాంతాలకు పారద్రోలండి. మనం హిందువులం శ్రీరాముడి భక్తులం!” అంటూ కర్నాటకలోని కొప్పాల్‌ జిల్లాలోని యెల్‌బుర్గాలో ఈ విద్వేష ప్రసంగం చేశాడు. ఫలితంగా కర్నాటక ప్రజలు తమ తీర్పు నిచ్చారు. ఎవరిని పారదోలాలన్నది బహుశా వారికి తెలిసినట్టుంది! ఆంగ్లేయులను ఎదిరించి పోట్లాడిన భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్‌ను వీరు దేశద్రోహి అని అంటారు. ఎందుకూ? అంటే – అతను ముస్లిం రాజు కాబట్టి! ఆంగ్లేయుల బూట్లు నాకి క్షమాభిక్ష అడుక్కున్న సావర్కర్‌ వీరి దృష్టిలో గొప్ప దేశభక్తుడు. ఎందుకూ? హిందూ మహాసభ / ఆరెస్సెస్‌ / బీజేపీల సభ్యుడు గనక! గాంధీని హత్యచేసిన గాడ్సేకు వెనక ఉన్నది సావర్కరేనన్న విషయం కావాలనే దాచిపెడతారు.
ఉత్తర ప్రదేశ్‌ అమేథికి చెందిన మహమ్మద్‌ ఆరిఫ్‌ కొన్నేళ్ళ క్రితం తన పొలంలో గాయపడి పడిపోయిన ‘సారస్‌’ రకం కొంగకు చిన్నపాటి కట్టుగట్టి వైద్యం చేసి కాపాడాడు. అలా ఆ కొంగ అతని దగ్గరే ఉండిపోయింది. అటవీశాఖ అధికారులు వచ్చి ఆ కొంగను స్వాధీనం చేసుకుని సమస్‌పూర్‌ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆరిఫ్‌పై అధికారులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. పక్షి ప్రాణాలు కాపాడినందుకు బీజేపీ ప్రభుత్వం ఆరిఫ్‌పై కేసు పెట్టింది. కారణం మరేమీలేదు, అతను ముస్లిం కావడమే. అలా కేసులు పెడితే పెద్ద పెద్ద వాళ్ళమీదే పెట్టాలి. ప్రధాని మోడీ తన నివాసంలో నెమళ్ళు పెంచుకుంటే కేసు ఉండాలి కదా? అలాగే యూపీ ముఖ్యమంత్రి యోగి తన కార్యాలయంలో పనిచేస్తూ ఉండగా, ఆయన ఒళ్ళో బుల్లి కోతి వచ్చి కూర్చుంటుంది. ఆయన దాన్ని ఆడిస్తూ ఉంటాడు. ఆయన మీద కేసు ఉండాలి కదా? వీళ్ళు ఆ జంతువుల / పక్షుల గాయాలు మాన్పలేదు. ఆరోగ్యంగా ఉన్నవాటినే పెంచుకుని ఆడుకుంటున్నారు. అటవీ చట్టం ప్రకారం అడవి జంతువుల్ని బలవంతంగా ఇంట్లో కట్టి పడేసుకోవడం నేరం. ప్రాణాలు కాపాడి, ఆహారం పెట్టినందుకు ఓ కొంగ ముస్లిం యువకుడికి దగ్గరయ్యింది. అంతే – అది అతని పెంపుడు పక్షి కాదు. బలవంతంగా దాన్ని తన దగ్గర ఉంచుకోలేదు. విషయం క్షుణ్ణంగా పరిశీలించక, దురుద్దేశంతో కక్షపూరితంగా కేసులు పెట్టడం నేటి బీజేపీ ప్రభుత్వానికి అలవాటైపోయింది. MEMORY GARBAGE IS FULL – CLEAN అంటూ తరచూ మనం మన మొబైల్‌లో ఒక మెసేజ్‌ చూస్తుంటాం కదా? అయితే అది, నేటి మన కేంద్ర ప్రభుత్వానికి కూడా పనికొచ్చేట్లుగా ఉంది! మన కేంద్ర ప్రభుత్వపు పోకడ చూస్తే ఒక ఉరుదూ కవి ఇలా అన్నాడు… ”ఓ చైన్‌ సె సోరహేఁ హై షహర్‌ బేచ్‌కర్‌ / కొయీ సుహాగ్‌ బచారహా జేవర్‌ బేచ్‌కర్‌ / బాప్‌ నె ఉమర్‌ గుజారీ థీ ఘరొందే బనానే మె / బేటా ఉస్‌కి సాంసే ఖరీద్‌ రహాహై ఘర్‌ బేచ్‌కర్‌ / బర్బాద్‌ హౌగయే కయీఁ ఘర్‌ దవా ఖరీద్‌ నే మే / కుచ్‌ లోగోంకి తిజోరీ భర్‌గయీ జహర్‌ బేచ్‌కర్‌”.
భారత ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ”మై యుద్ద్‌కి దేశ్‌ సే నహీఁ ఆయా/ మై బుద్ధ్‌కి దేశ్‌ సే ఆయా హూఁ” అని గొప్పగా చెప్పుకున్నాడు. అంటే నేను యుద్ధాలు చేసే దేశం నుండి రాలేదు. నేను బుద్ధుడు పుట్టి పెరిగిన దేశం నుండి వచ్చాను – అని అర్థం! అలా చెప్పుకోవడం బాగుంది. కానీ, నేను ముఖం నుండి మనుషులు పుట్టే దేశం నుండి వచ్చాను. భుజాల నుండి మనుషులు పుట్టే దేశం నుండి వచ్చాను – అని ఎందుకు చెప్పుకోలేదూ? వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ జరిగిన దేశం నుండి వచ్చాను అని కదా చెప్పుకోవాలి? మరి అలా ఎందుకు చెప్పుకోలేకపోయారూ? అలా చెప్పుకుంటే, ప్రపంచ పౌరులు నవ్వుకుంటారని భయం. ఒకప్పుడు గుజరాత్‌లో ఇప్పుడు మళ్ళీ మణిపూర్‌లో నరమేధం జరుగుతూ ఉంటే దేశ ప్రధాని మౌనవ్రతం చేపట్టడమేమిటీ? దేశ ప్రజలకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పి, సమస్యను పరిష్కరించాల్సింది ఎవరూ? గత్యంతరం లేక నిండు పార్లమెంట్‌లో విపక్ష నేత – ‘తమరు దేశభక్తులు కారు. దేశ ద్రోహులు’ అని గొంతెత్తి అరవాల్సిన పరిస్థితి వచ్చింది కదా?
ఈ దేశ పాలకులు రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటున్నారా? లేక మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నారా? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎంతకాలం అధికారం వెలగబెట్టగలరూ? ‘మీ విద్వేషపు బజారులో మేం ప్రేమ దుకాణాలు తెరుస్తూ వెళతాం’ అని అన్నారు విపక్షనేత రాహుల్‌. ”డెమోక్రసీ హమారీ డిఎన్‌ఏ మై హై” అని దేశ ప్రధాని అమెరికా వైట్‌హౌస్‌లో గొంతు చించుకుని వచ్చారు. అసలు ఆయనకు డెమాక్రసీ అనే పదం ఉచ్చరించే అర్హత ఉందా? అని దేశ పౌరులు ఆలోచనలో పడ్డారు. వాస్తవాల్ని తొక్కిపెట్టి గాలి కబుర్లు చెప్పేవారిని ఈ ఆధునిక – ఆలోచనా యుగంలోని జనం విశ్వసించరు. మణిపూర్‌లో ఇద్దరు కుకీ తెగ మహిళల్ని నగంగా ఊరేగించిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహించింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. మానవ హక్కుల్ని కాపాడాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ”మణిపూర్‌ మె భారత్‌ మాతాకి హత్యా హు ఈ హై” అని విపక్షనేత గొంతు చించుకుని అరిచిన అరుపు పార్లమెంట్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. జాతుల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్ల కోసం కుట్రలు చేసే పాలకులు మతాన్ని దోపుడు కర్రలుగా చేసుకుని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఏమనుకోవాలీ? అదొక వికలాంగ ప్రభుత్వమనుకోవాలి! మతం వేరు – ప్రజాస్వామ్యం వేరు అని పాలకులు గ్రహించినప్పుడు కదా మళ్ళీ దేశ ఆరోగ్యం పునరుద్ద రించబడేదీ? రాహుల్‌ గాంధీ ఆక్రోశాన్ని పార్లమెంట్‌ రికార్డుల్లోంచి తొలగించుకోగలరు. కానీ, ప్రపంచ పౌరుల మనుసుల్లోంచి తొలగించలేరు.

– వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love
Latest updates news (2024-05-20 11:18):

huuman Rpq cbd gummies where to buy | doctor recommended cbd tinnitus gummies | cbd gummies thc percentage iRg | cbd gummies what does it make you feel o1p | difference between cbd gummies r3Q and cbd oil | hemp Sqj techniques cbd gummies | cbd Evh gummies hillstone hemp | how many S3U cbd gummies does it take to feel it | cbd gummies can d0J they make you high | Nw2 wyld 500mg cbd gummies | 750mg full spectrum Rwo cbd gummies | how to make cbd gummies with agar agar 7k5 | y03 recipe for cbd sugar free gummies | cbd oil cbd blend gummies | VvY cbd gummies for sobriety | are Exf cbd gummy bears effective | cbd gummies helped 42r my teen with anxiety | are BYg cbd gummies better than oil | kanai farms cbd gummies 1NA | how many cbd gummies should i eat for TX1 pain | best cbd gummies for 0og anti inflammatory | do cbd gummies bcB make you laugh | hemp gummies vs RQU cbd gummies | Vz9 cbd gummies for anxiety delta 8 | do cbd asa gummies for arthritishave thc | 500 mg 4Jk of cbd gummy | dqY van u sell cbd gummies ebay | how many koi cbd gummies should i LWs take | cbd gummies cheap xXj 1000 mg shark | cbd vibe gummies most effective | oros cbd gummies S5R owner | just cbd gummies thc bLo level | true full spectrum cbd gummies vVA | where to buy hemp bomb cbd gummies 2LT near me | willow cbd gummies anxiety | mayim bialik cbd gummies G79 reviews | bumble cbd 76N gummies reviews | Oud cbd gummies for hair regrowth | cbd frucht gummis doctor recommended | cbd gummies for arthritis on tiI shark tank | anxiety hempworks cbd gummies | will cbd gummies work for chronic cWS pain | cbd vape nr3 cbd gummies | is cbd gummies legal in VuM spain | diamond cbd oil gummie rings Ume | cbd store that Cds sells gummies near me | sunsoil cbd Df8 oilcbd gummies | can i eat cbd gummies FPO while drinking | whoopie cbd free trial gummies | 5SP where to buy jolly cbd gummies