
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన రంజిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి యువకులు, ఇతర గల్ఫ్ నుండి విచ్చేసిన సోదరులు, ముదిరాజ్ యువకులు పార్టీలో చేరారు. భీంగల్ మండలం కొత్త తండాకు చెందిన సదర్ మాలావత్ మొహన్ సింగ్ నాయక్, కొత్త తండా గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోత్ గంగాధర్ నాయక్, బత్తి లాల్ గులాబీ కండువా కప్పుకున్నారు. భీంగల్ మండలం దేవక్కపేట గ్రామనికి చెందిన యువకులు, భీంగల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మాజీ వార్డు మెంబర్ జావిద్ పార్టీలోచేరారు. వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తింటి పెద్ద రాజన్న, రామన్నపేట గ్రామం కాంగ్రెస్ కి చెందిన ముదిరాజ్ యువకులు, వెంకటాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొండల మహేష్ బీఆర్‌ఎస్ లో చేరారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన శ్రీ ఆంజనేయ యూత్, వడ్ల సంఘం సభ్యులు బీఆర్‌ఎస్ నాయకులు ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
బాల్కొండ మండలం వన్నెల్ బి అంబేద్కర్ యూత్ సభ్యులు బీఆర్‌ఎస్ గూటికి చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
సాదరంగా ఆహ్వానించారు.
ఏకగ్రీవ తీర్మానం..
బడా భీంగల్ గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు మంగళవారం వేల్పూర్ లోని స్వగృహంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ చేసుకున్న ఏకగ్రీవ తీర్మానం కాపీని మంత్రి ప్రశాంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
