నవతెలంగాణ- జుక్కల్: సంక్షేమ పథకాల అమలలులో దేశంలో మేమే నెం వన్ అని జహిరాబాద్ పార్లమెంట్ సబ్యుడు బిబి పాటీల్ అన్నారు. బుదువారం నాడు జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ అబ్యర్థి ఎమ్మెలే హన్మంత్ షిండే కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని వ్యాపార సముదాయలలో తిరిగి కారుగుర్తుకు ఓటు వేసి హన్మంత్ షిండేను ఎమ్మెలే గా గెలుపించాలని ఓటర్లకు కోరారు. ఈ సంధర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో రాజ్యంగనిర్మాత విగ్రహనికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం వందలాదిగా కాంగ్రేస్ మరియు బిజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి అకర్షితులై వారికి చెపట్టిన సంక్షేమ పథకాలకు అమలు బాగుందని ఎంపి బిబి పాటీల్ అద్వర్యంలో గులాబీ కండువ కప్పి పార్టీలోకి హ్వనించారు. ఈ సంధర్భంగా మాహరాష్ట్ర లోని పథకాల అమలు తీరును అక్కడి నాయకులు వచ్చి ఇక్కడి ఓటర్లకు వివరించారు. ఇటువంటి పథకాలు మహరాష్ట్ర ప్రభూత్వం చేపట్టడం లేదని విమర్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ది పనులను రోడునుండి వస్తుంటే గ్రామాలలో కన్పిస్తున్నదని, మంచి వారికి గెలిపించాలని వారు పేర్కోన్నారు. ప్రజలు అలోచించి హన్మంత్ షిండే ను కారుగుర్తుకు ఓటువేసి ఆఖండ మెజార్టీ తో గెలిపించాలని తెలిపారు. ఈ సంధర్భంగా స్థానిక సర్పంచ్ రాములు అద్వర్యంలో మండల సర్పంచుల సంఘం ఘణంగా ఎంపి ని సన్మానించారు. బిబి పాటీల్ మాట్లాడుతుండగా ప్రజలు చప్పట్లు కొట్టి జైతెలంగాణ అంటు నినదాలు చేయడంతో జోష్ నింపారు, విండోచైర్మేన్ శివానంద్, మాజీమార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్, మాజీవిండో చైర్మేన్ పడంపల్లి రాజుపటేల్, సీనియర్ నాయకులు నీలుపటేల్, మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, పార్టీమండల అదియక్షుడు మాదారావ్ దేశాయి, యువ నాయకుడు అక్షయ్ పాటీల్, రామ్ పటేల్, శీవాజీపటేల్, రాజు, సర్పంచులు రవిపటేల్, రాములు, కపిల్ పాటీల్, గొల్లహన్మండ్లు, జాగృతి కన్వీనర్ అనితాసింగ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.