– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి అరుణ జ్యోతి
నవతెలంగాణ – ఆర్మూర్
బీసీల ఆర్థిక తోడ్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నికలలో బీసీల ఓట్ల కోసమే అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి అరుణ జ్యోతి అన్నారు. శనివారం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు బీసీలకు ఆర్థిక తోడ్పాటు నందిస్తాయా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్ 9 సంవత్సరాలుగా బీసీలను మోసం చేస్తున్నారని అన్నారు.. బిసి విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినారు..బీసీల అభ్యున్నతిని ముఖ్యంగా కులవృత్తుల వారి సంక్షేమం విస్మరించిన కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాననడం సిగ్గుచేటని అన్నారు. నేడు విశ్వబ్రాహ్మణ కులస్తులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నార నీ వీరితోపాటు ఇతర బీసీ కుల వృత్తుల వారు తెలంగాణలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని,, క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి తగిన సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు..