సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

– సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.
– సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయండి.
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ – సిరిసిల్ల
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.నకిలీ లాటరీలు,సోషల్ మీడియాలో నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం, నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ మొదలగు వంటి వాటి పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదన్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు, కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజులు వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు
సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు అజియో యాప్ లో షాపింగ్ చేసినందుకు గిఫ్ట్ కూపన్ వచ్చింది అని చెప్పి సైబర్ మోసగాడు కాల్ చేశాడు. జియో యాప్ లో 5000/- డ్రెస్సెస్ కార్ట్ లో ఆడ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాలని చెప్పారు.బాధితుడు అలాగే చేశాడు కాట్లో ఆడ్ చేసిన ఐటమ్స్ కి సస్పెక్ట్ చెప్పిన అకౌంట్ కి మనీ పే చేశాడు. గిఫ్ట్ క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ కొంత అమౌంట్ పే చేయండి మీకు రిఫండ్ వస్తది అని మోసగాడు నమ్మించాడు. ఈ విధంగా బాధితుడు 20,000/- మోసపోయాడు.
– సిరిసిల్ల టౌన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి బజాజ్ ఎగ్జిక్యూటివ్ అని కాల్ వచ్చింది. మీకు లోన్ శాంక్షన్ అయ్యింది మీరు కొంత అమౌంట్ పే చేయాలి అనగా బాధితుడు పే చేశాడు. ప్రాసెసింగ్ ఫీస్ కోసం మరికొంత మనీ అడగగా పే చేశాడు. తదుపరి మరికొంత అమౌంట్ పే చేయమని అడిగాడు సైబర్ మోసగాడు.ఈ విధంగా బాధితుడు 11,300/- మోసపోయాడు.

– వేములవాడ టౌన్ పరిధిలో బాధితుడు డిటిడిసి కొరియర్ కస్టమర్ నెంబర్ ని గూగుల్ లో సెర్చ్ చేసి కాల్ చేశాడు.అడ్రస్ అప్డేట్ చేయాలని లింక్ సెండ్ చేశాడు సైబర్ నేరస్తుడు. బాధితుడు లింకు ఓపెన్ చేసి అడ్రస్ అప్డేట్ చేయగానే ఓటిపి వచ్చింది. ఆ ఓటీపీని సైబర్ నేరస్తునికి చెప్పగానే బాధితుని ఖాతాలో 25000/- నష్టపోయాడు.

– వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఏ వన్ బిల్లా సిమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేశాడు. అది సైబర్ మోసగాడి నెంబర్. సైబర్ నేరస్థుడు చెప్పిన మాయ మాటలు విని బాధితుడు 2,65,000/- + 95,400/- మొత్తం 3,60,400/ – సైబర్ నేరస్తుని ఖాతాలో జమ చేయడం జరిగింది.
– సిరిసిల్ల టౌన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఆన్లైన్ వర్క్ ఫ్రం హోం అని వాట్స్అప్ మెసేజ్ వచ్చింది. తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో ఆడ్ చేశారు యూట్యూబ్లో వీడియోస్ కి లైక్ అండ్ షేర్ చేయాలని టాస్కులు ఇచ్చారు. అలా ఒక్కో టాస్క్ పెంచుతూ పోయారు. ఈ విధంగా బాధితుడు 1,33,200/- మోసపోయాడు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
– మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.
– అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
– వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్రకటనలను నమ్మకండి.
– తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.
– మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించాలని సూచించారు.