
– విజయవంతానికి జిల్లా నాయకులు పుల్లయ్య పిలుపు…
నవతెలంగాణ- అశ్వారావుపేట: ఎన్నికల ప్రచారం గడువు సమీపించటం తో మూడో విడత పార్టీ ప్రచారాన్ని ఉదృతం చేయాలని, అందుకోసం శాఖల వారీ ప్రచారాన్ని విస్త్రుత పరచాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మండల కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ, శాఖా కార్యదర్శుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ నెల 25 న అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల ప్రచారానికి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు సాయి బాబా, బి.వెంట్ లు,27 న జరిగే ద్విచక్ర వాహన ర్యాలీ కి తెలంగాణ – ఆంధ్ర రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు, వి.వెంకటేశ్వర్లు హాజరు అవుతారని పుల్లయ్య తెలిపారు. ఈ రెండు ప్రచార కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు మాట్లాడుతు స్థానిక నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరుల ఓట్లను ప్రభావితం చేస్తారని, స్థానికంగా ఉన్న ప్రతీ నాయకుడు ఇంటింటి ప్రచారంలో పాల్గొని పార్టీ ఓట్లు పెంపుదలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి చిరంజీవి, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం నిర్మల, సీతారామయ్య, తగరం జగన్నాధం,మురళి తదితరులు పాల్గోన్నారు.