– బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ముండ మల్లయ్య యాదవ్
నవతెలంగాణ- నూతనకల్: తుంగతుర్తి నియోజకవర్గాన్ని కాలేశ్వరం జలాలను అందించి సాగు భూమిని సస్యశ్యామలం చేసిన ఘనత గాదరి కిషోర్ కుమార్ కి తగ్గిందని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్ అన్నారు శుక్రవారం మండల పరిధిలోని లింగంపల్లిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొనే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను, అమలు చేసే సంక్షేమ పథకాలను ఓటర్లకు అవగాహన కనిపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉన్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. మూడవసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మున్న లక్ష్మి మల్లయ్య ఉపసర్పంచ్ మున్నా లింగయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.