– ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి
నవతెలంగాణ-భువనగిరి
ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మహిళల సమస్యలు పట్టవా అని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి ప్రశ్నిం చారు. శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రం లోని దుంపల మల్లారెడ్డి స్మారక భవనంలో నిర్వ హించిన ఐద్వా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గంలో మూసీ నది జల కాలుష్యంతో మహిళలకు అనేక రకాల వ్యాధులు వస్తున్నాయని, చర్మ, గర్భ సంబం ధిత వ్యాధులు, క్యాన్సర్ దారిన పడుతున్నారన్నారు. రెండుసార్లు గెలిచిన బీఆర్‌ఎస్ ఇంతవరకు మూసీ ప్రక్షాళన గురించి పట్టించుకోవడంలేదని విమర్శిం చారు. మూసీ ప్రక్షాళన కోసం సీపీఐ(ఎం) అనేక సార్లు పాదయాత్రల తో సహా అనేక పోరాటాలు నిర్వ హించిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తామని చెప్పి, నేటికే హామీని నెరవేర్చలేదని తెలిపారు. పైగా బ్యాంకు ద్వారా రుణాలు పొందాలంటే డ్వాక్రా మహిళలకు బ్యాంకు డిపాజిట్ లక్ష రూపాయలు ఉండాలని షరతులు పెడుతున్నారని విమర్శించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నేటికీ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలు లేవన్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా స్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని నేటికీ అమలు చేయలేదని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అనేక రకాల దాడులు, హత్యలు, లైంగికదాడులు పెరిగాయన్నా రు. మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకు వస్తున్నా రన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థిగా నిలబడిన కొండ మడుగు నర్మింహ.. ఉపాధి పనుల్లో మహిళలకు కూలి రేట్లు పెంచాలని అనేక పోరాటాలు చేశారన్నా రు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసేటు వంటి వ్యక్తి కొండమడుగు నర్సింహను బలపరచా లని కోరారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, జిల్లా ఉపాధ్యక్షులు కొండమడుగు నాగ మణి, జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, నాయ కులు మాటూరి కవిత, భాగ్య, కొత్త లలిత, వడ్డె బోయిన స్వప్న, సింగన బోయిన లావణ్య, జయమ్మ, లక్ష్మమ్మ, తాడూరి, కలమ్మ పాల్గొన్నారు.