బీఆర్ఎస్ లోకి చేరినా బీజేపీ మండల ఊపా అద్యక్షులు

నవతెలంగాణ- నిజాంసాగర్: మండల కేంద్రంలోని బీజేపీ మండల ఊపా అధ్యక్షులు అయినటువంటి ఒంటరి నారాయణరెడ్డి గారు హనుమంతు షిండే  గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లోకి చెరార్. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ లో భారీగా చేరికలు జరుగుతున్నాయని కేసీఆర్ గారు చేసిన మంచి పనులను ప్రజలందరూ గుర్తిస్తున్నారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆయన గుర్తు చేశారు. మొన్న చెప్పినట్టుగానే ఇంకొన్ని రోజులలో బీజేపీకి కాంగ్రెస్ కు క్యాడర్ కూడా మిగలదని ఆయన ఎద్దేవా చేశాడు. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలువబోతుంది అని అయానా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, మల్లూరు సొసైటీ చైర్మన్ విట్టల్ రెడ్డి, బాబు సెట్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.