బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసిన వైఎల్ఎన్ గౌడ్

– దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక.

నవతెలంగాణ-సూర్యాపేట: బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ వై.ఎల్.ఎన్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం స్థానిక ఎంజి రోడ్ లో జరిగిన రోడ్ షో లో  వైఎల్ఎన్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వైఎల్ఎన్ గౌడ్ బీఆర్‌ఎస్‌లో ఎన్నో అవమానాలు పడ్డాడని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం వై.ఎల్.ఎన్ కు సముచితమైన స్థానం కల్పిస్తాం అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతోందని తెలిపారు. డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గా వై.ఎల్.ఎన్ నియామకం… బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎల్ఎన్ గౌడ్ ను డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా వైఎల్ఎన్ గౌడ్ మాట్లాడుతూ దామోదర్ రెడ్డి గెలుపే లక్ష్యం గా పని చేస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.