నవతెలంగాణ- చండూరు: గట్టుప్పల రెండో రోజు ఇంటింటి ప్రచార నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం గట్టుపల్ టౌన్ కార్యదర్శి కర్నాటి సుధాకర్ ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో గల మేత్తే నాయకుడు కష్టజీవుల కోసం మాట్లాడే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి దోనూరు నర్సిరెడ్డిని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కర్నాటి మల్లేశం గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలను డబ్బు బలంతో రోజుకొక పార్టీ మారే అభ్యర్థులను ఓడించాలని, ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ లు మద్యంతో డబ్బు మదంతో అధికారంలోకి రావాలని తహతలాడుతున్నారని అన్నారు. పేదల కోసం కష్టజీవుల కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం టౌన్ కార్యదర్శులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు, సీనియర్ నాయకులు ఎండి రబ్బాని, పసుపుల చెన్నయ్య,పెద్దగాని నరసింహ, బొబ్బలి చంద్రయ్య, కురుమతి అబ్బయ్య, ముసుకు బుచ్చిరెడ్డి, కర్నాటి యాదయ్య, కర్నాటి తుకారం తదితరులు పాల్గొన్నారు.