ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించాలి కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు

చల్లా నర్సింహ్మారెడ్డి
గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌
రంగారెడ్డి జిల్లా సమావేశం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజీవ్‌ గాంధీ యూత్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించాలని జిల్లా నాయకులు కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ్మారెడ్డి సూచించారు. శనివారం గాంధీ భవన్‌లో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ ప్రవేశపెట్టిన యూత్‌ డిక్లరేషన్‌ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. రాష్ట్ర అవ తరణ దినోత్సవం జూన్‌ 2న రాజీవ్‌ గాంధీ యూత్‌ ఆన్‌లై న్‌ క్విజ్‌ పోటీల ద్వారా యువతకు అవగాహన కల్పించాల న్నారు. క్విజ్‌ పోటీల కోసం వచ్చే నెల 10 నుంచి 18 వరకు 35 ఏండ్ల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఎంపికైన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ప్రథమ బహుమతిగా లాప్‌టాప్‌, ద్వితీయ బహుమతిగా స్మార్ట్‌ ఫోన్‌, తృతీయ బహుమతిగా టాబ్‌ను అందజేస్తామ న్నారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎక్కువ మార్కులు సాధించిన యువతిని ఎంపిక చేసి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు 7661899899 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వినోద్‌, స్టేట్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సతీష్‌, టీసీసీ జనరల్‌ సెక్రెటరీలు వీర్లపల్లి శంకర్‌, బుర్ర జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, వేణుగౌడ్‌, జక్కడి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.