
– మన బాపు కేసిఆర్ … మళ్ళీ రావాలి…ముఖ్య మంత్రి గా ఉండాలి
– మా అయన… మీ అన్న హరీష్ రావు ను భారీ మెజారిటీ తో గెలిపించండి…
నవతెలంగాణ – సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇస్తే వచ్చింది కాదని, కొట్లాడి పోరాడి సాధించుకున్నదని మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత అన్నారు. ఉత్తర భారత దేశ నాయకులు తమ ఆధిపత్యం కోసమే పచ్చని తెలంగాణ లో చిచ్చు రేపుతున్నారన్నారు. సిద్దిపేట పేరును దేశవ్యాప్తం చేసిన హరీశ్ రావు పేరును ప్రపంచవ్యాప్తం చేయాలని సిద్దిపేట ప్రజలను కోరారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి లోని పలు వార్డులలో మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన శ్రీనిత రావుకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, కౌన్సిలర్లతో కలిసి ఆమె మాట్లాడారు, మన బాపు కేసిఆర్ మళ్ళీ రావాలి, ముఖ్య మంత్రి గా ఉండాలని, అందుకు మీరందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. హరీశ్ రావు ఎక్కడికి వెళ్లినా ఏది చూసినా దాన్ని సిద్దిపేట ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాడని తెలిపారు. తాము ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళినప్పుడు చూసిన డైనోసార్ పార్క్ ను సిద్దిపేటలో ఏర్పాటు చేయడమే దానికి నిదర్శనం అన్నారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలా ఉండే హరీశ్ రావు ను ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలన్నారు. 20 సంవత్సరాల కింద సిద్దిపేటకు ఇప్పటి సిద్దిపేటకు తేడా స్పష్టంగా కనిపిస్తుందని, ఈ మార్పుకు మంత్రి హరీష్ రావే ముఖ్య కారణమని ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఎన్నికల్లో 1,51,000 మెజార్టీ అందించి మీ బిడ్డ అయిన హరీశ్ రావు ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు కవిత సంపత్ రెడ్డి, బ్రహ్మం, గుడాల సంధ్య శ్రీకాంత్ గౌడ్, భూంపల్లి శ్రీలత శ్రీహరి, సాకి బాల్ లక్ష్మి ఆనంద్, నాయకులు మణిదీప్ రెడ్డి, కనకరాజు పలువురు పాల్గొన్నారు.