
నవతెలంగాణ – మాక్లూర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలోనే హామీలన్నీ అమలు చేస్తామని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని మాణిక్ బండారు తండా, మాణిక్ బండారు, అమ్రాద్, అమ్రాద్ తండా, ముత్యం పల్లి, ఒడ్యాట్ పల్లి, మందన్ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా కమీషన్లకు కకుర్తి పడిన ప్రభుత్వాన్ని అర్ ఎస్ ప్రభుత్వం అని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తే కమిషన్ల రావని ఒక్క ఇల్లు కూడా బిఅర్ఎస్ కట్టించలేదని తెలిపారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, పింఛను ఇవ్వలేదని గుర్తు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్పు కోరుతున్నారని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నికు కావలసిన అవసరాలను తీరుస్తానని పేర్కొన్నారు. అనంతరం జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజార్ కిషన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అంత మార్పు కోరుతుందని, గత తొమ్మిది సంవత్సరాల్లో ఏమి జరిగిందో మి అందరికీ తెలుసని కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మార్పులో భాగంగానే వినయ్ అన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవిప్రకాష్, బ్లాక్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజార్ కిషన్ రావు, పంచాయతి రాజ్ సంఘటన అధ్యక్షులు గంగాధర్ గౌడ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ దయాకర్ రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, సింగ్ విండో మాజీ వైస్ చైర్మన్ కంటజి రాజేశ్వర్, పురుషోత్తం, మాజీ ఎంపిటిసి నర్స గౌడ్, రవి, దన్యల్, జనార్దన్, మాజీ జడ్పీటిసి గోపాల్ నగేష్, జీబి గోవర్దన్, మట్ట రాము, జైల్ సింగ్, కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.