తెలంగాణ అప్పుల్లో అభివృద్ధి చెందింది: వడ్డీ మోహన్ రెడ్డి

నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఐదు లక్షల 60 వేల కోట్లు చేసి దేశంలోనే అభివృద్ధి చెందిందని బోధన్ బిజెపి అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలో శుక్రవారం రోడ్ షోలో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం, దళిత, బిసి మరియు మైనార్టీ బందులలో పార్టీ చెంచాగాళ్ళకు మాత్రమే సంక్షేమం జరిగిందని ఏ ఒక్క పేద వాడికైనా ఫలితం దక్కిందా అని ప్రశ్నించారు. తెలంగాణ విభజన అనంతరం 60 వేల కోట్లు అప్పు ఉన్న తెలంగాణ ప్రస్తుతం 5.50 లక్షల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని బిసి ముఖ్యమంత్రితో పాటు మహిళా రిజర్వేషన్ చేస్తున్న ఘనత బిజెపిది అని అన్నారు. మూడుసార్లు గెలిచి చేయలేని అభివృద్ధి సుదర్శన్ రెడ్డి ఇప్పుడు చేస్తాడా అని ప్రశ్నించారు. అందుబాటులో లేకుండా గ్రామాల్లో అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే షకీల్ అద్దె రక్షణ పొందుతూ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. సుదర్శన్ రెడ్డి హ్యాట్రిక్ ఓటమి ఖాయమని అలాగే షకీల్ కు హ్యాట్రిక్ గెలుపు తప్పించే బాధ్యత తనదేనని అన్నారు. 2006లో జడ్పిటిసిగా కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండింటిని సైకిల్ గుర్తుతో తొక్కిన ఘనత తనదేనని డిసెంబర్ 3 వ తేదీన గెలిచి విజయోత్సవం జరుపుకుందామని అన్నారు. 74 సంవత్సరాల వయసులో చెడ్డీ వేసుకోలేని వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తాడని మేడిపాటి ప్రకాష్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అడ్లూరి శ్రీనివాస్ శ్రీధర్, సరీన్, శైలేష్ కుమార్, ఆనంద్, రామకృష్ణ, పిల్లి శ్రీకాంత్, రాజేందర్ గౌడ్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love